రాత్రిపూట పండ్లను తినకూడదా.. పండ్లను తినేటప్పుడు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండలేదో..?

Published : Aug 11, 2023, 02:42 PM IST

పండ్లు, కూరగాయల్లో మంచి పోషకాలుంటాయి. అందుకే వీటిని చాలా మంది తింటుంటారు. అయితే వీటిని తినేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?  

PREV
16
రాత్రిపూట పండ్లను తినకూడదా.. పండ్లను తినేటప్పుడు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండలేదో..?

మనం తినే ఆహారమే మన ఆరోగ్యం ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాలను తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే మాంసాహారాల కంటే పండ్లు, కూరగాయలే మన ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి. అయితే వీటిని తినేటప్పుడు కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 
 

26

నీళ్లు

పండ్లు తిన్న వెంటనే నీళ్లను తాగే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. ఎందుకంటే చాలా రకాల పండ్లలో వాటర్ ఉంటుంది. కాబట్టి పండ్లు తిన్న వెంటనే నీళ్లను తాగాల్సిన అవసరం లేదు. అంతేకాక పండ్లనను తిన్న వెంటనే నీరు నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే మీ శరీరం పండ్ల నుంచి పోషకాలను గ్రహించకుండా పాక్షికంగా నిరోధిస్తుంది.
 

36

ఫ్రిజ్ లో ఉంచిన పండ్లు..

ఫ్రిజ్ లో లేదా బయట ఎక్కువ సేపు లేదా రోజుల తరబడి కట్ చేసిన పండ్లను తినకుండా ఉండటమే మంచిది. పండ్లు, కూరగాయలు కోసిన వెంటనే వాడాలి. లేదంటే వాటి క్వాలిటీ అంతా కోల్పోయి నిరుపయోగంగా మారిపోతారు. అంతేకాకుండా కోసిన పండ్లలోకి క్రిములు ప్రవేశించి అవి మన శరీరంలోకి చేరే అవకాశం కూడా ఉంది.
 

46
Image: Getty

అలా తినడమే మంచిది

కొంతమంది పండ్లను జ్యూస్ తో కలిపి తింటుంటారు. కానీ పండ్లను వీలైనంత వరకు అలాగే తినడమే మంచిది. మీరు పండ్ల రసాన్ని తయారు చేస్తున్నప్పటికీ మీరు దానిలో చక్కెరను ఎక్కువగా వేయకూడదు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. జ్యూస్ ను ఇష్టపడినా ఎప్పటికప్పుడు పండ్లు తినడం అలవాటు చేసుకుంటేనే పోషకాలు లభిస్తాయి.
 

56

రాత్రిపూట పండ్లను తింటే

రాత్రిపూట పండ్లను తినే అలవాటు చాలా మంది ఉంటుంది. అయితే ఇది మంచి అలవాటు కాదని కొందరు చెప్తుంటారు. ఎందుకంటే రాత్రిపూట పండ్లను తింటే మీ నిద్రకు భంగం కలుగుతుంది. అంటే అన్ని పండ్లు సహజంగా తీయగా ఉంటాయి. ఈ చక్కెర మన శరీరానికి 'ఎనర్జీ'ని అందిస్తుంది. దీనితో మీరు సరిగ్గా నిద్రపోలేరు.
 

66
fruits

చల్లని పండ్లు

వీలైనంత వరకు చల్లని పండ్లను తినకపోవడమే ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే ఇవి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. అలాగే బాగా పండిని లేదా సరిగా పండని పండ్లను తినకూడదు. ఎందుకంటే ఇవి గ్యాస్, సిడిటీ సమస్యలను కలిగిస్తాయి. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఇవి కడుపును కూడా దెబ్బతీయొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories