Health Tips: ఈ రోజుల్లో పుట్టిన పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు చేతిలో ఫోన్ కానీ లేకపోతే గడవడం లేదు. దీనివల్ల వచ్చే కంటి ఎఫెక్ట్ గురించి అశ్రద్ధ చేస్తున్నారు. అయితే కంటిమీద ఒత్తిడి పడకుండా ఈ సింపుల్ చిట్కాలతో కంటి నొప్పిని తగ్గించొచ్చు ఎలాగో చూద్దాం.
ఈ రోజుల్లో పిల్లల చేతుల్లో ఎక్కువగా సెల్ ఫోన్ లు లాప్టాప్ లే కనిపిస్తున్నాయి. దీనివలన చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాదు చిన్న చిన్న పిల్లలు కూడా కళ్లద్దాలు వాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కంటి సంరక్షణలో ఏ చిన్న పొరపాటు జరిగిన పెద్ద సమస్యని ఫేస్ చేయవలసి ఉంటుంది.
26
అందులోని ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లను మితిమీరి వాడటం వల్ల కళ్ళు మరింత బలహీన పడతాయి. అయితే తాత్కాలికంగా కంటి ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. కంటి ఒత్తిడికి రోజు వాటర్ చక్కని ఉపశమనం.
36
రోజ్ వాటర్ కంటి నొప్పిని,చికాకుని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం రెండు మూడు చుక్కల రోజ్ వాటర్ ని కళ్లలో వేసి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. కళ్ళల్లో దురద సమస్యకు కూడా రోజు వాటర్ ప్రయోజనకరంగా ఉంటుంది.
46
అలాగే కీర దోసకాయలు బంగాళదుంపలు కూడా కంటి ఒత్తిడి నుంచి ఒక క్షణం కలిగిస్తాయి ఇందుకోసం ముందుగా బంగాళాదుంప, కీరదోస ముక్కలు కట్ చేసి ఫ్రిజ్లో 20 నిమిషాలు పెట్టండి. ఆ తర్వాత బంగాళదుంప లేదా కీరా ముక్కలను మీ కళ్ళపై పెట్టుకోండి.
56
ఇలా చేయటం వల్ల కంటినొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. అలాగే ఎక్కువసేపు లాప్టాప్ ముందు ఉండకుండా ప్రతి గంటకి ఒకసారి బయటికి వచ్చి ప్రకృతిని, పచ్చదనాన్ని కాసేపు చూడండి. అలా చేయటం వల్ల కంటికి రిలాక్సేషన్ కలుగుతుంది.
66
ఇవి తాత్కాలిక రెమెడీస్ మాత్రమే. అలానే 24 గంటలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ముందు ఉండకండి. అలాగే కంటి నొప్పి లేదా కంటి ఒత్తిడి భరించలేనిదిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి.