పోషక లోపాలను పోగొట్టండి
డయాబెటిస్ పేషెంట్ల శరీరంలో పోషక లోపాలు ఎక్కువగా ఉంటాయి. మీరు తినే ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలనే తినండి. అవసరాన్ని బట్టి సప్లిమెంట్లను తీసుకోవచ్చు.
మంటను తగ్గించండి
జుట్టు రాలడం తగ్గాలంటే మీ శరీరంలో మంటను తగ్గించాలి. ఇందుకోసం యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తినాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిడిని తగ్గించాలి.
హార్మోన్ల అసమతుల్యతకు చెక్ పెట్టండి
డయాబెటిస్ హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది. అందుకే జుట్టు రాలడానికి కారణమయ్యే హార్మోన్ల అసమతుల్యతను పరిష్కరించడానికి డాక్టర్ ను సంప్రదించండి.