'టూత్ పేస్ట్'లో నిమ్మకాయ రసం కలిపి ముఖానికి పట్టిస్తే కలిగే మార్పులు ఇవే!

Navya G   | Asianet News
Published : Mar 05, 2022, 12:51 PM IST

అందరి ఇంటిలో అందుబాటులో ఉండే టూత్ పేస్ట్ (Toothpaste) దంతాలను ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచడంతో పాటు చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుంది.  

PREV
18
'టూత్ పేస్ట్'లో నిమ్మకాయ రసం కలిపి ముఖానికి పట్టిస్తే కలిగే మార్పులు ఇవే!

టూత్ పేస్ట్ తో చేసుకునే ఫేస్ ప్యాక్స్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. మరి ఇప్పుడు మనం టూత్ పేస్ట్ ను చర్మ సౌందర్యం (Skin beauty) కోసం ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం..
 

28

అందమైన చర్మ సౌందర్యం కోసం తెల్లని టూత్ పేస్ట్ ను మాత్రమే ఎంచుకోవాలి. ఇతర రంగు పేస్ట్ లను ఎంచుకోరాదు. మిగతా వాటితో పోలిస్తే ఇందులో తక్కువ శాతంలో ఫ్లోరైడ్ (Fluoride) వాడబడుతుంది. కాబట్టి మిగతా వాటి కంటే తెల్లని టూత్ పేస్ట్ చర్మ సౌందర్యం కోసం మంచి ఫలితాలను (Good result) అందిస్తుంది. 
 

38

మొటిమల నివారణ కోసం: ఒక కప్పులో కొద్దిగా టూత్ పేస్ట్ (Toothpaste) ను తీసుకోవాలి. దానికి సమానంగా అలోవెరా జెల్ (Aloevera gel) ను కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు మొటిమల మీద అప్లై చేసుకొని రాత్రంతా అలాగే ఉండనివ్వాలి. తర్వాత ఉదయం గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
 

48

నల్లని మచ్చలు పోవడం కోసం: ఒక కప్పులో కొద్దిగా టూత్ పేస్ట్ (Toothpaste), కొద్దిగా పాలు (Milk) వేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని దూదిపింజల సహాయంతో ముఖంపై నల్లటి మచ్చలు, కంటి కింద ఉండే నల్లటి వలయాలపై మృదువుగా అప్లై చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
 

58

బ్లాక్ హెడ్స్ తొలగిపోవడం కోసం: ఒక కప్పులో కొద్దిగా టూత్ పేస్ట్ (Toothpaste), కొద్దిగా ఉప్పు (Salt), కొద్దిగా నీటిని (Water) వేసి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసె ముందు ముఖానికి ఆవిరి పట్టుకోవాలి. తరువాత బ్లాక్ హెడ్స్ ఉన్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి.
 

68

చర్మ నిగారింపు కోసం: ఒక కప్పులో కొద్దిగా టూత్ పేస్ట్ (Toothpaste), ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా (Baking soda), ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం (Lemon juice) తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని పదిహేను నిమిషాల తర్వాత  గోరు వెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మ నిగారింపు పెరుగుతుంది.
 

78

చర్మాన్ని తాజాగా ఉంచడం కోసం: ఒక కప్పులో ఒక టేబుల్ స్పూన్ టూత్ పేస్ట్ (Toothpaste), కొద్దిగా నిమ్మరసం (Lemon juice) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని పదిహేను నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం తాజాగా ఉంటుంది. 
 

88

అయితే ఈ టిప్స్ ను పాటించే ముందు కొద్ది పరిమాణాన్ని టెస్ట్ (Test) గా మీ చేతి పైన అప్లై చేసుకోవడం మంచిది. ఎందుకంటే అన్ని చర్మ తత్వాలకు ఇది పడకపోవచ్చు. కనుక ముందుగా పరీక్షించి అప్లై చేసుకోవడం మంచిది. ఈ మిశ్రమాలను అప్లై చేసి, ముఖాన్ని శుభ్రపరచుకున్న తరువాత ఏదైనా మాయిశ్చరైజర్ (Moisturizer) ను అప్లై చేసుకోవాలి.

click me!

Recommended Stories