అది ఎక్కువగా తీసుకుంటే వచ్చే అనారోగ్య సమస్యలు ఇవే.. అవి ఏంటంటే?

Navya G   | Asianet News
Published : Mar 04, 2022, 03:20 PM IST

మద్యపానం (Alcohol) కొంచెం తాగుతున్నా, అప్పుడప్పుడు తాగుతున్నా మద్యానికి ఎవరి శరీరం ఎలా స్పందిస్తుందో తెలియదు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు (Illness issues) తలెత్తే అవకాశం ఉంది.  

PREV
19
అది ఎక్కువగా తీసుకుంటే వచ్చే అనారోగ్య సమస్యలు  ఇవే.. అవి ఏంటంటే?

అందుకే తాగకుండా ఉండడానికి ప్రాధాన్యమివ్వడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు మనం మద్యం సేవిస్తే వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసుకుందాం..
 

29

సరదాగా చేసుకున్న ఈ అలవాటు వారి జీవితకాలాన్ని (Lifetime) తగ్గించే అవకాశం ఉంటుంది. మద్యం ఎక్కువగా తాగడంతో శరీరంలోని భాగాలు మార్పులకు గురయ్యే అవకాశం ఉంటుంది. దీంతో వాటి పనితీరు సరిగా ఉండదు. దీంతో శరీరం బలహీనపడి (Weakened) అనేక అనారోగ్య సమస్యలకు గురవుతుంది. కనుక మద్యపానానికి దూరంగా ఉండడమే మంచిది. 
 

39

మెదడు: మద్యం తీసుకుంటే మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. దీంతో జ్ఞాపకశక్తి (Memory) కూడా తగ్గిపోతుంది. ఏ పని మీద దృష్టి పెట్టలేము. యాంగ్జైటీ, డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్ లాంటివి తలెత్తే అవకాశం ఉంటుంది. తాగుడు అలవాటు ఇలాగే దీర్ఘకాలం కొనసాగితే కేంద్ర నాడీ వ్యవస్థ (Central nervous system) మొత్తం దెబ్బతింటుంది. దీంతో చేతులు, పాదాలు స్పర్శ కోల్పోతాయి.
 

49

కాలేయం: కాలేయం (Liver) గంటకి ఒక ఔన్సు మధ్యనే మాత్రమే ప్రాసెస్ చేయగల శక్తిని కలిగి ఉంటుంది. మద్యపానం అధికంగా తీసుకున్నప్పుడు అదనపు కొవ్వు, మాంసకృతులు పేరుకుపోవడంతో కాలేయం పనితీరు దెబ్బతింటుంది. ఇది సిరోసిస్ అనే వ్యాధికి దారితీస్తుంది. మద్యపానాన్ని వడపోసే ప్రక్రియలో కాలేయం అధిక ఒత్తిడికి (High pressure) గురవుతాయి. 
 

59

సెక్స్: మద్యం తాగితే సెక్స్ (Sex) ను ఎక్కువగా ఆస్వాదించవచ్చు అని చాలా మంది భావిస్తారు. కానీ నిజానికి మద్యం సేవిస్తే సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గి లైంగిక కోరికలు (Sexual desires) పట్ల ఆసక్తి, సామర్థ్యం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో పూర్తి లైంగిక జీవితాన్ని ఆస్వాదించలేరు. భాగస్వామికి సంపూర్ణ తృప్తిని అందించలేరు.
 

69

మహిళలు: మహిళలు మద్యపానానికి దీర్ఘకాలం అలవాటు పడితే నెలసరి ఇబ్బందులతో పాటు సంతానం కలగకపోవడం (Infertility) వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. గర్భిణీలు ఎంత కొంచెం తాగినా కూడ గర్భస్రావం (Miscarriage), గర్భంలోని బిడ్డ మరణించడం లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 
 

79

గుండె: గతంలో 60 వయసు దాటిన వారిలో కనిపించే గుండె సమస్యలు (Heart problems) ఇప్పుడు 30  వయసులో కనిపించడానికి కారణం మద్యపానమే. అధిక రక్తపోటు (High blood pressure), గుండె లయ తప్పడం, స్ట్రోక్, గుండె వైఫల్యం, హార్ట్ఎటాక్ లాంటివి సంభవించవచ్చు. మధ్య వయసులో ఎక్కువగా తాగేవారిలో ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.
 

89

కడుపు: మద్యపానాన్ని తీసుకున్నప్పుడు అన్నవాహిక లోపలి సున్నితమైన కణజాలం (Tissue) పోషకాలనూ, విటమిన్లనూ గ్రహించలేక పోతుంది. దీంతో క్రమంగా పోషకాహారలోపం తలెత్తి శరీరం బలహీనంగా అయిపోతుంది. కడుపుబ్బరం (Abdominal), గ్యాస్, మలబద్ధకం, విరేచనాలు, పైల్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
 

99

అలాగే ఈ అనారోగ్య సమస్యలతో పాటు మద్యాన్ని సేవిస్తే హార్మోన్ల ఉత్పత్తిలో మార్పు, డయాబెటిస్ (Diabetes), ఎముకలు బలహీనపడటం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం (Decreased immunity), ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

click me!

Recommended Stories