ఇవి రోజుకు రెండు తింటే చాలు.. బెడ్‌రూమ్‌లో చెలరేగిపోతారు..?

Navya G   | Asianet News
Published : Mar 05, 2022, 12:00 PM IST

వంటింటిలో అందుబాటులో ఉండే సుగంధ ద్రవ్యాలలో యాలకులు (Cardamom) ప్రధానమైనవి. యాలకలు వంటలకు మంచి సువాసనను, రుచిని అందిస్తాయి.  

PREV
18
ఇవి రోజుకు రెండు తింటే చాలు.. బెడ్‌రూమ్‌లో చెలరేగిపోతారు..?

యాలకులలో ఉండే పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కనుక ప్రతిరోజు రెండు యాలకులను నమిలి తినడంతో శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) కలుగుతాయి. ఇప్పుడు మనం యాలకులను తీసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
 

28

యాలకులలో విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియంలతో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించి క్యాన్సర్ (Cancer), డయాబెటిస్ (Diabetes) వ్యాధుల నుంచి కాపాడుతాయి. శరీరానికి ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గించి ప్రశాంతతను కలిగిస్తాయి. కనుక ప్రతిరోజూ రెండు యాలకులను నమిలి తింటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం.
 

38

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది: యాలకులలో కావలసినంత స్థాయిలతో ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. వీటితో పాటు ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును (Blood pressure) అదుపులో ఉంచడానికి, గుండె పనితీరుకు సహకరిస్తుంది. యాలకులలో ఉండే పోషకాలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని (Heart health) మెరుగుపరుస్తాయి.
 

48

శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి: క్రమం తప్పకుండా యాలకులను తింటే పురుషులలో శృంగార సామర్థ్యం (Erotic ability) పెరుగుతుంది. ఇవి పురుషులలో శీఘ్రస్కలనం సమస్యను నివారిస్తాయి. అలాగే యాలకులలో ఉండే సినేయిల్ అనే ఎంజైమ్ (Sinyl enzyme) పురుషులలో నంపుసకత్వ లక్షణాలను నివారిస్తుంది. కనుక యాలకులను తీసుకుంటే శృంగారంలో యాక్టివ్ గా ఉంటారు.
 

58

జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి: తిన్న ఆహారాన్ని సక్రమంగా జీర్ణం చేయడానికి యాలకులు  సహాయపడతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు జీర్ణశక్తిని (Digestion) మెరుగుపరుస్తాయి. అలాగే కడుపులో ఏర్పడే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించే గుణాలు యాలకులలో ఉంటాయి. వీటితో పాటు  మలబద్దకం (Constipation) వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి.
 

68

దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి: యాలకులలో ఉండే పోషకాలు నోటిలోని బ్యాక్టీరియాపై చాలా సమర్థవంతంగా పోరాడుతాయి. రోజూ క్రమం తప్పకుండా రెండు యాలకులను నోట్లో వేసుకొని నమిలి తింటే నోటి దుర్వాసన (Bad breath) పోయి చిగుళ్లు, దంతాలు ఆరోగ్యంగా (Dental health) ఉంటాయి. అలాగే నోటి ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. నోటికి మంచి సువాసనను అందిస్తాయి.
 

78

చర్మ నిగారింపును మెరుగుపరుస్తాయి:  యాలకులలో ఉండే విటమిన్లు చర్మ రక్త ప్రసరణ (Blood circulation) మెరుగుపరచడానికి సహాయపడతాయి. చర్మంపై ఏర్పడే మొటిమలు, మచ్చలు, ముడతలను తొలగించి చర్మానికి నిగారింపును అందిస్తాయి. అలాగే చర్మ ఆరోగ్యాన్ని (Skin health) మెరుగుపరిచి చర్మం కాంతివంతంగా, సున్నితంగా మార్చేందుకు  ఉపయోగపడతాయి.
 

88

శ్వాససంబంధిత సమస్యలు తగ్గుతాయి: వాతావరణంలోని మార్పుల కారణంగా వచ్చే దగ్గు, జలుబు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి ఇతర సమస్యలను తగ్గించేందుకు యాలకులు సమర్థవంతంగా సహకరిస్తాయి. యాలకులు ఆస్తమాను (Asthma) కూడా అదుపులో ఉంచే గుణాలను కూడా కలిగి ఉంటాయి. అలాగే గురక (Snoring) తగ్గేందుకు కూడా సహాయపడతాయి.

click me!

Recommended Stories