చర్మ సౌందర్యాన్ని పెంచడానికి ఆముదం నూనె కూడా దివ్యౌషధంగా సహాయపడుతుంది. ఆముదం గింజల నుండి ఈ నూనెను తీస్తారు. ఈ నూనె లేత పసుపు రంగులో చిక్కగా ఉంటుంది. ఈ నూనెలో రిసినోలియెక్ ఆమ్లం (Ricinoleic acid), ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants), విటమిన్ ఇ, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యానికి మంచి ఎఫెక్టివ్ బ్యూటీ ప్రొడక్ట్ గా ఉపయోగపడతాయి.