కోకో పౌడర్ ఫేస్ ప్యాక్‌ను ప్రయత్నించండి.. మెరిసే చర్మం మీ సొంతం!

Published : Apr 16, 2022, 02:17 PM IST

కోకో పౌడర్ (Cocoa powder) ను కేక్ తయారీలోనూ, చాక్లెట్స్ ల తయారీలోనూ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే కోకో పౌడర్ ను వంటలకు మాత్రమే కాదు చర్మ సౌందర్య లేపనాలలో కూడా ఉపయోగిస్తారు...  

PREV
16
కోకో పౌడర్ ఫేస్ ప్యాక్‌ను ప్రయత్నించండి.. మెరిసే చర్మం మీ సొంతం!

కోకో పౌడర్ తో ఇంట్లోనే సహజసిద్ధమైన పద్ధతిలో తయారుచేసుకునే ఫేస్ ప్యాక్స్ (Face packs) చర్మ సౌందర్యం కోసం మంచి ఫలితాలను అందిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ ఫేస్ ప్యాక్స్ ల తయారీ విధానం గురించి మనం తెలుసుకుందాం..
 

26

కోకో పౌడర్ తో చేసుకునే ఫేస్ ప్యాక్స్ చర్మాన్ని కాంతివంతంగా మార్చడంతో పాటు అనేక చర్మ సమస్యలను (Skin problems) తగ్గించడానికి సహాయపడుతాయి. ఈ ఫేస్ ప్యాక్స్ లలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మానికి పోషణనివ్వడంతో పాటు దద్దర్లు, కమలడం వంటి సమస్యలను కూడా దూరం చేస్తాయి. దీంతో చర్మ ఆరోగ్యం మెరుగుపడి చర్మ సౌందర్యం (Skin beauty) మరింత రెట్టింపవుతుంది.
 

36

కోకో పౌడర్, అలోవెరా జెల్ ఫేస్ ప్యాక్: కాంతివంతమైన చర్మ సౌందర్యం కోసం కోకో పౌడర్ (Cocoa powder), అలోవెరా జెల్ (Aloe vera gel) ఫేస్ ప్యాక్ మంచి ఫలితాలను అందిస్తాయి. ఇందుకోసం ఒక కప్పులో ఒక స్పూన్ కోకో పౌడర్, ఒక స్పూన్ అలోవెరా జెల్ వేసి బాగా కలుపుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే కాంతివంతమైన చర్మ సౌందర్యం మీ సొంతం.  
 

46

కోకో పౌడర్, గ్రీన్ టీ, పాల ఫేస్ ప్యాక్: ఒక కప్పులో ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్ (Cocoa powder), ఒక టేబుల్ స్పూన్ పాలు (Milk) , రెండు టేబుల్ స్పూన్ ల కాచి చల్లార్చిన గ్రీన్ టీ (Green tea) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని పదిహేను నిమిషాల తరువాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా కనీసం వారానికి రెండుసార్లు చేస్తే చర్మ సమస్యలు తగ్గి చర్మానికి మంచి నిగారింపు అందుతుంది.
 

56

కోకో పౌడర్, ఆలివ్ ఆయిల్ ఫేస్ ప్యాక్: ఒక కప్పులో ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్ (Cocoa powder), ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ (Olive oil) వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని అరగంట తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా కనీసం వారానికి రెండు మూడు సార్లు అప్లై చేసుకుంటే చర్మం మృదువుగా, కోమలంగా మారుతుంది.
 

66

కోకో పౌడర్, తేనె, అరటి గుజ్జు: ఒక కప్పులో ఒక స్పూన్ కోకో పౌడర్ (Cocoa powder), ఒక స్పూన్ తేనె (Honey), కొద్దిగా బాగా పండిన అరటిపండు గుజ్జు (Banana pulp) వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి అప్లై చేసుకుని అరగంట తరువాత శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే చర్మకణాలలో పేరుకుపోయిన మురికి తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది. దీంతో చర్మ ఛాయ మెరుగుపడుతుంది.

click me!

Recommended Stories