Image: Freepik
దేశంలో చాలా నగరాల్లో డెంగ్యూ విజృంభిస్తోంది. ఈడిస్ ఈజిప్టి జాతికి చెందిన ఆడ దోమలు కుట్టడం వల్లే డెంగ్యూ జ్వరం వస్తుంది. ఉష్ణోగ్రత, తేమతో కూడిన వాతావరణంలో ఈ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. వాంతులు, తీవ్రమైన తలనొప్పి, వికారం, చర్మపు దద్దుర్లు, కీళ్ల నొప్పులు, కళ్ల నొప్పి, కండరాల నొప్పి డెంగ్యూ లక్షణాలు. డెంగ్యూకు సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేయించుకోకపోతే అలసట, వాంతులు, చంచలత, చిగుళ్ల నుంచి రక్తస్రావం, విపరీతమైన కడుపునొప్పి, రక్తస్రావం వంటి ఎన్నో ప్రమాదకరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొన్ని ఆయుర్వేద చిట్కాలను ఫాలో అయితే డెంగ్యూ నుంచి చాలా త్వరగా కోలుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటంటే?
Image: Getty Images
కొబ్బరి నీరు
కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ వాటర్ మన శరీర ఆరోగ్యాన్ని, చర్మాన్ని ఆరోగ్యంగా మెరుగ్గా ఉంచుతుంది. కొబ్బరి నీటిని తాగడం వల్ల డెంగ్యూ సాధారణ లక్షణాలైన వాంతులు, నిర్జలీకరణం సమస్యలు తగ్గుతాయి. అందుకే డెంగ్యూ సమస్యతో బాధపడేవారు కొబ్బరి నీటిని రెగ్యులర్ గా తాగాలి.
Fenugreek Water
మెంతి వాటర్
మెంతులు మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. ఇది మన శరీరాన్నే కాదు జుట్టు, చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మెంతివాటర్ ను శక్తివంతమైన నొప్పి నివారణాగా కూడా ఉపయోగించొచ్చు. డెంగ్యూ జ్వరం నుంచి త్వరగా కోలుకోవాలంటే మెంతులను రాత్రంతా నానబెట్టి వడకట్టి పొద్దున్నే తాగాలి.
papaya leaves
బొప్పాయి ఆకులు
డెంగ్యూను తగ్గించడానికి బొప్పాయి ఆకుల రసం ఎంతగానో సహాయపడుతుంది. ఇందుకోసం దీన్ని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. బొప్పాయి ఆకుల రసం మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్లేట్ లెట్ ల సంఖ్యను కూడా పెంచుతుంది. ఇది డెంగ్యూ లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం ఈ రసాన్ని రోజుకు రెండుసార్లు తాగాలి.
వేప రసం
వేపాకుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి శరీరంలో వైరస్ పెరుగుదలను తగ్గిస్తాయి. అలాగే వ్యాధి తొందరగా నయమయ్యేందుకు సహాయపడుతుంది. వేపరసం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో రక్తంలో ప్లేట్లెట్ సంఖ్య పెరుగుతుంది. ఇందుకోసం వేపాకులను కాసేపు నీటిలో మరిగించి వడకట్టి తాగాలి.
Image: Getty Images
ఆరెంజ్ జ్యూస్
విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అందుకే డెంగ్యూ పేషెంట్లు ఆరెంజ్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. దీంతో మీరు డెంగ్యూ నుంచి చాలా త్వరగా కోలుకుంటారు.