vagina
ఆడవారు యోనికి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడటానికి వెనుకాడుతుంటారు. ప్రతి మహిళా ఎప్పుడో ఒకసారి యోనిలో దురద, మంట, దుర్వాసన వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇవి ఆడవారికొచ్చే సర్వ సాధారణ సమస్యలు. చెమట ఎక్కువగా పట్టడం, పరిశుభ్రత పాటించకపోవడం, ఆహారపు అలవాట్ల వల్ల ఈ సమస్యలు వస్తాయి. జననేంద్రియాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆడవారు కొన్ని ప్రాథమిక నియమాలను పాటించాలని నిపుణులు అంటున్నారు. కానీ చాలా మంది ఆడవారు వీటిని విస్మరిస్తారు. యోని నుంచి చెడు వాసన రావొద్దంటే కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
vagina
యోని వాసనకు కారణాలు
తరచుగా చెమట పట్టడం
యోని ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలి. అయితే చెమట బ్యాక్టీరియా పెరిగేందుకు దారితీస్తుంది. దీంతో యోనిలో దురద, దుర్వాసన సమస్యలు వస్తాయి. నిజానికి వ్యాయామం తర్వాత స్నానం చేయకపోవడం, సరైన లోదుస్తులను వేసుకోకపోవడం వల్ల చెమట పడుతుంది. దీంతో యోనిలో వాసన రావడంతో పాటుగా దద్దుర్ల సమస్య కూడా వస్తుంది.
మూత్ర సంక్రమణ
మూత్ర విసర్జన తర్వాత యోనిని సరిగ్గా శుభ్రం చేయకపోతే యూటీఐ సమస్య వస్తుంది. దీనివల్ల యోనిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. అలాగే దుర్వాసన కూడా పెరుగుతుంది. మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట, నొప్పి సమస్యలు వస్తాయి.
ప్రైవేట్ పార్ట్ జుట్టు
ప్రైవేట్ పార్ట్ వెంట్రుకలను తొలగించడం ద్వారా బ్యాక్టీరియా సంక్రమణ ప్రమాదాన్ని నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఈ వెంట్రుకలు అధిక చెమట, సంక్రమణకు కారణమవుతాయి. వీటిని తొలగించకపోవడం వల్ల యోనిలో దుర్వాసన వస్తుంది.
నీటి కొరత
మీ శరీరంలో తగినంత నీరు లేకపోతే మీరు డీహైడ్రేషన్ బారిన పడతారు. దీంతో మీ మూత్రం రంగు మారుతుంది. అలాగే మూత్రం కూడా దుర్వాసన వస్తుంది. అందుకే మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా అవసరం. హైడ్రేషన్ మీ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. యోనిని ఆరోగ్యంగా ఉంచుతుంది.
Vaginal Care
యోని వాసనను ఎలా నివారించాలి?
పరిశుభ్రత పట్ల శ్రద్ధ
యోని ఆరోగ్యంగా ఉండటానికి మూత్ర విసర్జన తర్వాత యోనిని శుభ్రం చేయాలి. అలాగే సెక్స్ తర్వాత కూడా యోనిని శుభ్రం చేసుకోవాలి. క్లీనింగ్ కోసం సుగంధ సబ్బు లేదా లిక్విడ్ ఇంటిమేట్ వాష్ కు బదులుగా సువాసన లేని ఉత్పత్తులను ఉపయోగించాలి.
సరైన లోదుస్తులు
రోజంతా టైట్ గా ఉండే లోదుస్తులను వేసుకోవడం వల్ల యోనిలో దురద, చెడు వాసన వస్తాయి. నిజానికి ఇది యోని చర్మంలో తేమను ఉంచుతుంది. ఇది సంక్రమణకు దారితీస్తుంది. అందుకే టైట్, సింథటిక్ ప్యాంటీలకు బదులుగా కాటన్ క్లాత్ తో తయారు చేసిన లోదుస్తులను ధరించండి.
vaginal health
పుష్కలంగా నీటిని తాగాలి
మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవడానికి నీటిని పుష్కలంగా తాగాలి. దీంతో మీ శరీరంలోని విష పదార్థాలన్నీ బయటకు పోతాయి. ఇన్ఫెక్షన్ ముప్పు కూడా తగ్గుతుంది. శరీరంలో వాటర్ సరిపడా లేకపోవడం వల్ల యోనిలో దుర్వాసన , చికాకు కలుగుతుంది. అందుకే నీటితో పాటుగా మజ్జిగ, కొబ్బరి నీరు, పండ్ల రసాలు, నిమ్మకాయ నీటిని తాగాలి. ఇవి మీ శరీరాన్ని డీహైడ్రేషన్ సమస్య నుంచి కాపాడుతాయి.