డయాబెటీస్ ఉంటే ఈ వ్యాధి ఖచ్చితంగా వస్తుందా?

First Published | Oct 30, 2023, 1:12 PM IST

డయాబెటిస్ చికిత్స లేని వ్యాధి. ఇది జీవిత కాలం ఉంటుంది. దీన్ని కేవలం నియంత్రించగలం అంతే. అయితే ఈ డయాబెటీస్ వల్ల ఒక ప్రమాదకరమైన వ్యాధి వచ్చే అవకాశం ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అదేంటంటే? 
 

డయాబెటిస్ ఒక జీవనశైలి వ్యాధి అన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ఒకప్పటిలా ఈ వ్యాధిని తేలిగ్గా ఎవరూ తీసుకోవడం లేదు. ఈ వ్యాధిని నియంత్రించేందుకు ఎన్నో ప్రయత్నాలను చేస్తున్నారు. డయాబెటీస్ చిన్న సమస్యగా  కనిపించినా.. ఇది ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుంది. 

diabetes

ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది. నిజానికి ఈ డయాబెటిస్ ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని ఎన్నో పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. యూపీలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పరిశోధకులు దీనిపై ఒక అధ్యయనం నిర్వహించారు.

Latest Videos


osteoporosis

ఈ అధ్యయనం ప్రకారం..  డయాబెటీస్ పేషెంట్లలో.. ఈ వ్యాధి వారి ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వెల్లడైంది. ఇది బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుందని అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం.. డయాబెటిస్ ఎక్కువగా వృద్ధుల్లో ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలోనే ఈ సమస్య ఎక్కువగా ఉండొచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.

డయాబెటీస్ పేషెంట్లలో కాల్షియం తగ్గడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. పెద్దలు రోజుకు సగటున 200 మిల్లీగ్రాముల కాల్షియాన్ని తీసుకుంటున్నారు. కానీ ఇది వారి ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి సరిపోదు. అందుకే వీళ్లు రోజకు కనీసం 1000-2000 మిల్లీగ్రాముల కాల్షియాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే వీళ్లు సూర్యరశ్మిలో తగినంత సేపు ఉండకపోవడం వల్ల విటమిన్ డి లోపం ఉంటుంది. దీంతో మీ ఎముకల ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. పలు నివేదికల ప్రకారం.. భారతదేశంలో  విటమిన్ డికి ఎలాంటి లోటు లేకున్నా..70 శాతానికి పైగా ప్రజలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. 

osteoporosis

అలాగే మన రెగ్యులర్ గా వ్యాయామం చేయని వారు కూడా ఉన్నారు. ఇది భారతీయుల్లో కూడా ఎక్కువగా ఉంది అని ఈ అధ్యయనానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ సంజీవ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఎముకల ఆరోగ్యం సరిగ్గా లేని డయాబెటీస్ పేషెంట్లకు బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని  పరిశోధనల్లో వెల్లడైండి. 

click me!