స్వెట్టర్, సాక్సు లు వేసుకుని నిద్రపోతే ఏమౌతుందో తెలుసా?

First Published | Dec 3, 2024, 11:15 AM IST

చలికి తట్టుకోలేక చాలా మంది స్వెట్టర్లు, కాళ్లకు సాక్సులు వేసుకుని, నిండా దుప్పటి కప్పుకుని నిద్రపోతుంటారు. కానీ ఇలా పడుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? 

దుప్పటి కప్పుకున్నా చలిపెడుతుందని చాలా మంది చలికాలంలో స్వెట్టర్లు, సాక్సులు వేసుకుని పడుకుంటుంటారు. దీనివల్ల చలి పెట్టడం తగ్గినా.. ఇది ఆరోగ్యానికి మాత్రం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవును స్వెట్టర్లు, సాక్సులు, నిండా దుప్పటి కప్పుకుని నిద్రపోతే మీకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


హార్ట్ పేషెంట్లకు మంచిది కాదు

చలికి తట్టుకోవడానికి చాలా మంది ఈ సీజన్ లో ఉన్ని దుస్తులను వేసుకుని నిండా దుప్పటి కప్పుకుని పడుకుంటుంటారు. కానీ ఇలా పడుకోవడం గుండె జబ్బులున్నవారికి ప్రమాదకరం.  ఎందుకంటే ఇవి మన శరీర వేడిని లోపలే ఉంచుతాయి. వేడిని బయటకు రానీయవు. కానీ ఇలా స్వెట్టర్ సుకుని దుప్పటి కప్పుకుని పడుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఇది హార్ట్ పేషెంట్లకు, డయాబెటీస్ ఉన్నవారికి అస్సలు మంచిది కాదు. 
 


చంచలత, ఆందోళన

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. చలికాలంలో మన రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఇలాంటి పరిస్థితిలో ఉన్ని దుస్తులను వేసుకుని పడుకుంటే బాడీ వేడిగా అవుతుంది. దీనివల్ల బీపీ చాలా వరకు తగ్గుతుంది. అందుకే నిద్రపోయేటప్పుడు కాటన్ బట్టలు వేసుకుని పడుకోవాలి. లేదంటే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. 

దురద, మంట, అలెర్జీ

మీకు తెలుసా? మనం వేసుకుని ఉన్ని స్వెట్టర్లు మన శరీర ఉష్ణోగ్రతను బాగా పెంచుతాయి. దీనివల్ల మనం నిద్రపోతున్నప్పుడు చెమట పడుతుంది. దీనివల్ల చర్మం దురద పెడుతుంది. చికాకు కలుగుతుంది. ముఖ్యంగా మీకు అలెర్జీ ఉంటే. డ్రై స్కిన్ ఉన్నవారికి ఈ సమస్య మరింత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఉన్ని మన చర్మాన్ని మరింత పొడిగా చేస్తాయి. అందుకే రాత్రి పడుకునేటప్పుడు స్వెట్టర్లు, సాక్సులు వసుకోకూడదు. తేలికపాటి కాటన్ దుస్తులు వేసుకుని పడుకోవాలి. అలాగే మాయిశ్చరైజ్ చేసుకోవడం మర్చిపోకూడదు. 

రాత్రిపూట బాగా నిద్రపట్టాలంటే ఏం చేయాలి? 

మీరు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా రాత్రిపూట బాగా నిద్రపోవాలంటే మీ గది ఉష్ణోగ్రత 18-20 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలి. వేడి ఎక్కువగా ఉంటే నిద్రపట్టడం కష్టమవుతుంది. 
అలాగే పడుకునే ముందు రూం చీకటిగా ఉండేలా చూసుకోవాలి. ఇది నిద్రకు సహాయపడే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. 
 

పడుకునే ముందు ఫోన్, టీవీ, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు దూరంగా ఉండాలి. వీటివల్ల నిద్రకు భంగం కలుగుతుంది. 
ప్రశాంతంగా పడుకోవాలంటే మంచి దిండు, పరుపు ఖచ్చితంగా ఉండాలి. 
ముఖ్యంగా ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి, ఇది మిమ్మల్ని హెల్తీగా ఉంచుతుంది. 


పడుకునే ముందు టీ, కాఫీ వంటి కెఫిన్, ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. వీటివల్ల మీ నిద్ర డిస్టబెన్స్ అవుతుంది. 
నిద్రపోవడానికి ముందు యోగా, ధ్యానం వంటివి చేయండి. ఇవి మీ ఒత్తిడిని తగ్గించి మీరు బాగా నిద్రపోయేలా చేస్తాయి. 

Latest Videos

click me!