చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి చాలా మంది కాఫీని తరచుగా తాగుతుంటారు. ఎలాంటి సీజన్ అయినా సరే.. కాఫీని మోతాదుకు మించి తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే దీనిలో ఉండే కెఫిన్ కంటెంట్ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
green coffee
అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది టీ, కాఫీలకు బదులుగా గ్రీన్ టీని తాగడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నిజానికి గ్రీన్ టీ టేస్టీగా ఉండటమే కాదు. మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే మనలో చాలా మందికి గ్రీన్ కాఫీ గురించి తెలియదు. ఈ గ్రీన్ కాఫీ కూడా ఎంతో టేస్టీగా ఉండటంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో కెఫిన్ కంటెంట్ అసలే ఉండదు. అందుకే దీన్ని వీలైనంత వరకు తాగొచ్చు. ఈ గ్రీన్ కాఫీ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీన్ని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం
గ్రీన్ కాఫీ బీన్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. ఈ కాఫీలో పొటాషియం, సోడియంలు తక్కువగా ఉంటాయి. అందుకే ఇది అధిక రక్తపోటు పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
డయాబెటిస్ రోగులకు ప్రయోజనకరం
గ్రీన్ కాఫీ డయాబెటిస్ పేషెంట్లకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ నార్మల్ గా ఉంటాయి. ఈ కాఫీని తాగడం వల్ల శరీరంలో మంట కూడా తగ్గుతుంది. మీరు డయాబెటిస్ పేషెంట్ అయితే గ్రీన్ కాఫీని రోజూ తాగండి.
శరీరానికి శక్తి
గ్రీన్ కాఫీ ఎనర్జీ బూస్టర్ గా కూడా పనిచేస్తుంది. మీకు అలసటగా అనిపిస్తే గ్రీన్ కాఫీని ఎంచక్కా తాగొచ్చు. ఈ గ్రీన్ కాఫీని తాగడం వల్ల మీ శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.
green tea
చెడు కొలెస్ట్రాల్ తగ్గింపు
ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయిన వారికి కూడా గ్రీన్ కాఫీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ గ్రీన్ కాఫీ బీన్స్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. దీంతో మీ గుండె సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటుంది. మీరు రెగ్యులర్ గా గ్రీన్ కాఫీని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
చర్మానికి మేలు
గ్రీన్ కాఫీలో కొవ్వు ఆమ్లాలు, రైడిక్ ఆమ్లం, లినోలెయిక్ ఆమ్లం, ఒలేయిక్ ఆమ్లం ఉంటాయి. ఇవి మన చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి.