కొంతమంది రాత్రి భోజనంలో ఎక్కువ కేలరీలు, కొవ్వు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకుంటారు. ఇది అధిక బరువు పెరగడానికి దారితీస్తుంది, ఆరోగ్యానికి కూడా హానికరం. ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులను, రాత్రి భోజనంలో చేర్చుకోవడం ముఖ్యం. కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, తృణధాన్యాలు వంటివి రాత్రి భోజనంలో చేర్చుకోవడం మంచిది.