జెమ్స్ తయారీలో షుగర్, లిక్విడ్ గ్లూకోజ్, వెజిటేబుల్ ఫ్యాట్‌తో పాటు రకరకాల కలర్స్‌ను ఉపయోగిస్తుంటారు. వీటిలో అత్యంత ప్రమాదకరమైంది ఈ రంగులే. పిల్లలు ఎంత ఇష్టంగా చప్పరిస్తూ తినే ఈ కలర్స్ చిన్నారుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇందులో ఉపయోగించే కొన్ని కలర్స్ టైటానియం డై ఆక్సైడ్‌తో తయారు చేస్తారు. ఇది ఏకంగా మనిషి డీఎన్‌ఏపై ప్రభావం చూపుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. ఈ కారణంగానే వీటిని యూరోపియన్ యూనియన్ నిషేధించి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడి ప్రభుత్వం వీటిపై నిషేధం విదించింది.
ఇక పసుపు రంగు జెమ్స్ తయారీకి టాట్రాజైన్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారంటా.. దీనివల్ల చిన్నారుల్లో ఆస్తామా, హైపర్ సెన్సిటివిటీ వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నీలం రంగు జెమ్స్ తయారీ కోసం ఉపయోగించే రసాయనాల వల్ల ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని దేశాల్లో వీటిని బ్యాన్ చేశారు. మరికొన్ని కలర్స్‌ను ఏకంగా థార్‌తో తయారు చేస్తారంటా. వీటి వల్ల కూడా ఆస్తామా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని దేశాల్లో వీటిని బ్యాన్ చేశారు. ఇంకా మరెన్నో కలర్స్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
నోట్: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఈ విషయాలను ఏషియా నెట్ ధృవీకరించడం లేదని రీడర్స్ గమనించాలి.