ఆలివ్ ఆయిల్ & తేనె:
ఆలివ్ ఆయిల్‌తో కొద్దిగా తేనె, పంచదార కలిపి చేతులు, కాళ్ళకు రాసుకుంటే, చర్మంలోని చనిపోయిన కణాలు తొలగిపోతాయి. దీంతో చర్మానికి తగినంత తేమ లభించి కాంతివంతంగా కనిపిస్తుంది.
పెరుగు:
పెరుగు మంచి మాయిశ్చరైజర్ కాబట్టి, చలికాలంలో రోజూ చేతులు, కాళ్ళకు పెరుగు రాసుకుని 20 నిమిషాలు మసాజ్ చేసి, ఆ తర్వాత కడిగేయాలి. ఇది చర్మానికి తేమను అందిస్తుంది.