విటమిన్ డి మాత్రలు వాడుతున్నారా? అయితే ఇవి తప్పకుండా తెలుసుకోండి!

Published : May 29, 2025, 04:46 PM IST

విటమిన్ డి శరీరానికి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. అందుకోసం చాలామంది విటమిన్ డి మాత్రలు వాడుతుంటారు. కానీ అవి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. విటమిన్ డి మాత్రలు ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.   

PREV
16
విటమిన్ డి మాత్రలు ఎక్కువగా తీసుకుంటే?

విటమిన్ డి మాత్రలు ఎక్కువగా తీసుకుంటే రక్తంలో కాల్షియం స్థాయి పెరిగి 'హైపర్‌కాల్సీమియా' వస్తుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ డి క్యాల్షియం శోషణకు సహాయపడుతుంది. కానీ విటమిన్ డి ఎక్కువైతే కాల్షియం శోషణ ప్రమాదకర స్థాయికి చేరుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

26
కిడ్నీ సమస్యలు:

అధిక కాల్షియం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కిడ్నీ వడపోత సామర్థ్యం తగ్గిపోతుంది. కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది.

36
గుండె, రక్తనాళాల సమస్యలు:

అధిక కాల్షియం రక్తనాళాలు, గుండెలో పేరుకుపోయి.. రక్త నాళాలను దెబ్బతీస్తుంది. ఇది అధిక రక్తపోటు, గుండె జబ్బులు, పక్షవాతం వంటి సమస్యలకు దారితీస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారు విటమిన్ డి మాత్రలు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

46
మానసిక సమస్యలు:

విటమిన్ డి మాత్రల వల్ల వచ్చే హైపర్‌ కాల్సీమియా.. మానసిక, అభిజ్ఞా సమస్యలను కలిగిస్తుంది. అయోమయం, నిరాశ, ఆందోళన, మానసిక స్థితి మార్పులు, నిద్రలేమి వంటివి ఇందులో ప్రధానమైనవి. తీవ్రమైన సందర్భాల్లో కోమాకు కూడా దారితీయవచ్చు.

56
విటమిన్ డి మాత్రలు ఎప్పుడు వాడాలి?

మీకు విటమిన్ డి లోపం ఉందని డాక్టర్ నిర్ధారించినప్పుడు మాత్రమే ఈ మాత్రలు వాడాలి. రక్త పరీక్ష ద్వారా మీ విటమిన్ డి స్థాయిని తెలుసుకోవచ్చు. డాక్టర్ సలహా లేకుండా మాత్రలు వాడితే ఆరోగ్యానికి హానికరం.

66
సహజంగా విటమిన్ డి ఎలా పొందాలి?

ఉదయం, సాయంత్రం వేళల్లో 10-15 నిమిషాలు ఎండలో ఉండటం వల్ల శరీరానికి విటమిన్ డి అందుతుంది. అలా అని ఎక్కువసేపు ఎండలో ఉండకూడదు. సాల్మన్ వంటి కొవ్వు కలిగిన చేపలు, గుడ్డు సొన, పాలు, ధాన్యాలు తీసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories