White Hair: తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఇవి రాస్తే చాలు..!

Published : May 18, 2025, 04:41 PM IST

వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం చాలామంది తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. దీన్ని తగ్గించుకునేందుకు కొందరు మార్కెట్లో దొరికే హెయిర్ కలర్స్ ఉపయోగిస్తుంటారు. వాటిలో చాలావరకు కెమికల్స్ ఉండటం వల్ల జుట్టు సమస్యలు మరింత పెరుగుతున్నాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో తెల్ల జుట్టు సమస్యను ఈజీగా దూరం చేసుకోవచ్చు. అవెంటో ఇక్కడ చూద్దాం.

PREV
16
White Hair: తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఇవి రాస్తే చాలు..!

మెలనిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల జుట్టు తెల్లబడటం ప్రారంభమవుతుంది. ఒత్తిడి, పోషకాహార లోపం, ఇతర కారణాలు జుట్టు తెల్లబడటాన్ని వేగవంతం చేస్తాయి. అయితే ఇంట్లో తయారుచేసిన కొన్ని హెయిర్ ఆయిల్స్ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, సహజ రంగును పునరుద్ధరించడంలో సహాయపడతాయి. అవెంటో.. ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

26
ఉసిరి, కొబ్బరి నూనె

ఉసిరిలో అధిక విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. కొబ్బరి నూనెతో ఉసిరి రసాన్ని కలిపి తలకు రాసుకోవడం ద్వారా మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది జుట్టు నెరవడాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టుకి ఈ ఆయిల్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

36
బ్రింగరాజ్, నువ్వుల నూనె

జుట్టు సంరక్షణ కోసం "మూలికల రాజు" గా పిలువబడే బ్రింగరాజ్ చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన నువ్వుల నూనెను.. ఈ మూలికలతో కలిపినప్పుడు.. ఇది జుట్టుకు పోషణను అందిస్తుంది. జుట్టు నెరవడాన్ని నివారిస్తుంది. సహజ జుట్టు రంగును పునరుద్ధరించడంలో ఇది బాగా సహాయపడుతుంది.

46
మెహందీ, బాదం నూనె

జుట్టు సంరక్షణ కోసం మెహందీని ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నారు. విటమిన్లు E, Bతో కూడిన బాదం నూనెను మెహందీతో కలిపి జుట్టుకు రాసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జుట్టుకు సహజ రంగును జోడిస్తుంది. జుట్టును బలపరుస్తుంది.

56
రోజ్మేరీ, ఆలివ్ నూనె

రోజ్మేరీ జుట్టు పెరుగుదలను, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. ఆలివ్ నూనె లోతైన హైడ్రేషన్‌ను అందిస్తుంది. రోజ్మేరీ ఆకులతో ఆలివ్ నూనెను కలిపి మసాజ్ చేసినప్పుడు, అవి జుట్టును బలపరుస్తాయి. రంగును మెరుగుపరుస్తాయి.

66
బ్లాక్ టీ, జొజొబా నూనె

బ్లాక్ టీలో టానిన్లు ఉంటాయి. ఇవి సహజంగానే జుట్టును నల్లగా చేస్తాయి. జొజొబా నూనె.. చర్మంలోని సహజ నూనెల మాదిరిగానే.. జుట్టును లోపలి నుంచి హైడ్రేట్ చేయడానికి, సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఈ మిశ్రమం నెరిసిన జుట్టు రంగును మెరుగుపరుస్తుంది. పోషణను అందిస్తుంది. పొడిబారడాన్ని తగ్గిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories