Acidity: మీరు అసిడిటీతో ఇబ్బంది పడుతున్నారా? ఈ డ్రింక్స్ తో చెక్‌ పెట్టండిలా!

Published : May 17, 2025, 01:15 PM IST

Acidity: వేసవి కాలంలోచాలా మంది అసిడిటీ సమస్యతో బాధపడుతుంటారు. దీని నుండి తక్షణ ఉపశమనం పొందడానికి చల్లని పానీయాలను తాగవచ్చు. ఇవి త్వరగా శరీరంలో పనిచేసి, కడుపు సమస్యను పరిష్కరించి చల్లదనాన్ని కలిగిస్తాయి.  మీ ఎసిడిటీని తొలగించడంలో సహాయకరంగా ఉండే ఆ పానీయాల  గురించి తెలుసుకుందాం.  

PREV
17
Acidity: మీరు అసిడిటీతో ఇబ్బంది పడుతున్నారా? ఈ డ్రింక్స్ తో చెక్‌ పెట్టండిలా!
ఓమ వాటర్

ఓమ అనేది అద్భుతమైన ఔషధ గుణం కలిగిన పదార్థం. దీనిలో ఉండే థైమోల్ అనే సమ్మేళనం జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించి, ఆహార జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. దీని వల్ల అసిడిటీ రాకుండా నివారించవచ్చు.

ఒక టీస్పూన్ ఓమను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో వేసి 10-15 నిమిషాలు నానబెట్టండి. తర్వాత వడకట్టి తాగండి. ఓమ నీరు కడుపునొప్పి, ఉబ్బరం,  వాయువు సమస్యకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. దీన్ని ఖాళీ కడుపుతో లేదా భోజనం తర్వాత కూడా తాగవచ్చు.

27
గోంధోరాజ్ ఘోల్: సువాసన మరియు ఉత్తేజం

,

గోంధోరాజ్ ఘోల్ అనేది ఓ బెంగాలీ పానీయం. ఇది గంధరాజ్ నిమ్మకాయ (కాఫిర్ లైమ్), పుల్లటి పెరుగుతో తయారు చేయబడుతుంది. ఇది వేసవిలో కాలంలో ఈ డ్రింక్ తయారు చేయడం వల్ల రిఫ్రెష్ గా, చల్లనిగా ఉంటుంది.  గోంధోరాజ్ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. 

తయారీ విధానం: ఒక గ్లాసులో పెరుగు లేదా మజ్జిగ తీసుకోండి. దానిలో గోంధోరాజ్ నిమ్మరసం చుక్కలను పిండి వేయండి. కొద్దిగా ఉప్పు,  చక్కెర (కావాలనుకుంటే) కలిపి బాగా కలపండి. రుచికరమైన బెంగాలీ శైలి లస్సీ సిద్ధం.

37
మసాలా సోడా

మసాలా సోడా.. ఓ రిఫ్రెష్ డ్రింక్ మాత్రమే కాదు.  ఇది అసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిలో కలిపే అల్లం, జీలకర్ర, నిమ్మకాయ వంటి పదార్థాలు జీర్ణక్రియకు సహాయపడతాయి.

ఒక గ్లాసులో చల్లటి సోడా నీటిని తీసుకోండి, దానిలో అర టీస్పూన్ అల్లం రసం, పావు టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా, అర నిమ్మరసం.. బాగా కలిపితే మసాలా సోడా సిద్ధం.

47
కొబ్బరి నీరు

కొబ్బరి నీరు.. ఒక సహజమైన, ఉత్తేజకరమైన పానీయం. దీనిలోని ఎలక్ట్రోలైట్లు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడతాయి. ఇంకా, ఇది కడుపులోని ఆమ్లతను సమతుల్యం చేయడానికి కూడా సహాయపడుతుంది.  కొబ్బరి నీరు తాగడం వల్ల దీనిలోని పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడతాయి.

57
సోంపు నీరు

సోంపు గింజలలో ఉండే అనెథోల్ అనే సమ్మేళనం జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కడుపు నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని కూడా కలిగిస్తుంది. ఒక టీస్పూన్ సోంపు గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం ఆ నీటిని వడకట్టి తాగండి. దీన్ని భోజనానికి ముందు లేదా తర్వాత కూడా తాగవచ్చు.

67
మజ్జిగ

మజ్జిగలో ప్రోబయోటిక్‌లు పుష్కలంగా ఉంటాయి. ఈ మంచి బాక్టీరియాలు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి, ఇది అసిడిటీ, జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. 

తయారీ విధానం: పెరుగును బాగా చిలికి, అవసరమైన నీరు, కొద్దిగా ఉప్పు కలిపి కలపండి. కావాలనుకుంటే.. కొద్దిగా అల్లం లేదా కొత్తిమీర ఆకులను కలిపి తాగవచ్చు. ఇది శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తుంది. భోజనం తర్వాత మజ్జిగ తాగడం జీర్ణక్రియకు చాలా మంచిది.

77
నిమ్మరసం

నిమ్మరసం నీరు ఒక రిప్రెష్ మెంట్ డ్రింక్. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. అసిడిటీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే, కొంతమందికి ఇది ఆమ్లతను పెంచవచ్చు, కాబట్టి మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి దీన్ని తీసుకోండి.

Read more Photos on
click me!