Cancer Risk Habits: మీరు రోజు చేసే ఈ 5 తప్పులే క్యాన్సర్‌కు కారణం.. వెంటనే మారకపోతే డేంజరే !

Published : Jul 13, 2026, 10:36 AM IST

Cancer Risk Habits: భారతీయుల్లో క్యాన్సర్ ముప్పు పెరుగుతోంది. దీనికి కొన్ని రోజువారీ అలవాట్లు కారణం అవుతున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. క్యాన్సర్ రిస్క్ పెంచుతున్న 5 రోజువారీ అలవాట్లు, నివారణల గురించి డబ్ల్యూహెచ్‌ఓ చెప్పిన పూర్తి వివరాలు మీకోసం.

PREV
17
క్యాన్సర్ రిస్క్ పెంచే 5 రోజువారీ అలవాట్లు

ప్రస్తుతం క్యాన్సర్ మహమ్మారి చాలా వేగంగా విస్తరిస్తోంది. మన జీవనశైలిలో జరుగుతున్న మార్పులు, కొన్ని చెడు అలవాట్లు ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక షాకింగ్ రిపోర్టును విడుదల చేసింది. ఆ వివరాలు ఏంటి? మనం మార్చుకోవాల్సిన ఐదు రోజువారీ అలవాట్ల గురించిన వివరాలు గమనిస్తే..

27
డబ్ల్యూహెచ్‌ఓ షాకింగ్ రిపోర్ట్: 10 మందిలో ఒకరికి ముప్పు

ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టు ప్రకారం.. 75 సంవత్సరాల వయస్సు కంటే ముందే ప్రతి 10 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. భారతీయుల విషయానికి వస్తే, 10 మంది భారతీయ పౌరులలో ఒకరు 75 ఏళ్ల లోపే ఈ మహమ్మారి బారిన పడే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. మారుతున్న జీవనశైలి, పర్యావరణ కారకాలు, సకాలంలో వ్యాధి నిర్ధారణ కాకపోవడం వల్ల ఈ ముప్పు పెరుగుతోంది.

ఇదే పరిస్థితి కొనసాగితే, 2050 నాటికి ప్రతి సంవత్సరం కొత్తగా 2.8 మిలియన్ల క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని రిపోర్టు హెచ్చరిస్తోంది. భారత్‌లో 2022 లోనే దాదాపు 1.41 మిలియన్ల కొత్త కేసులు నమోదు కాగా, 9,16,000 కంటే ఎక్కువ మంది మరణించారు. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ మొదటి స్థానంలో ఉండగా, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. పురుషులలో నోటి క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

37
పొగాకు, గుట్కా, ధూమపానం

మనం రోజూ చూసే చెడు అలవాట్లలో పొగాకు వాడకం అత్యంత ప్రమాదకరం. సిగరెట్, బీడీలు తాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. లంగ్ క్యాన్సర్ కేసుల్లో దాదాపు 85% కేవలం ధూమపానం వల్లే వస్తున్నాయని అంచనా. అంతేకాదు, పొగాకు నమలడం, గుట్కా తినడం, తమలపాకులతో పాటు పొగాకు కలిపి చుట్టడం వంటి అలవాట్ల వల్ల నోటి క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ.

పొగాకు వాడకం వల్ల కేవలం ఊపిరితిత్తులు, నోరే కాకుండా గొంతు, అన్నవాహిక, మూత్రాశయం, కాలేయం సహా కనీసం 15 రకాల క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ముప్పును తగ్గించుకోవడానికి పొగాకు అలవాట్లను పూర్తిగా మానేయడమే ఏకైక మార్గం.

47
సెడెంటరీ లైఫ్‌స్టైల్

కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోవడం, అస్సలు శారీరక శ్రమ లేకపోవడం క్యాన్సర్‌కు మరో ముఖ్య కారణం. రోజంతా ఒకే చోట కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగి ఊబకాయం వస్తుంది. ఈ ఊబకాయం అనేది బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్‌లకు దారితీస్తుంది. బరువును అదుపులో ఉంచుకోవడానికి, శరీరంలో వాపులను తగ్గించుకోవడానికి వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి.

57
జంక్ ఫుడ్, అన్‌హెల్తీ డైట్

మనం తినే ఆహారం కూడా మన ఆరోగ్యం తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం చాలా మంది పండ్లు, కూరగాయలు, ఫైబర్ ఉన్న ఆహారాన్ని పక్కన పెట్టేస్తున్నారు. వీటికి బదులుగా ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్ చేసిన ఆహారాలు, రిఫైన్డ్ షుగర్, రెడ్ మీట్ ఎక్కువగా తింటున్నారు. ఈ విధమైన అనారోగ్యకరమైన డైట్ వల్ల పెద్దపేగు క్యాన్సర్, ఇతర రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.

67
మితిమీరిన తాగుడు అలవాటు

రెగ్యులర్‌గా, ఎక్కువగా ఆల్కహాల్ సేవించడం క్యాన్సర్ రిస్క్‌ను విపరీతంగా పెంచుతుంది. తాగుడు అలవాటు వల్ల ముఖ్యంగా లివర్, నోరు, అన్నవాహిక క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా ఆపేయడం లేదా బాగా తగ్గించడం ద్వారా క్యాన్సర్‌తో పాటు ఇతర ప్రాణాంతక వ్యాధుల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

77
నివారణోపాయాలు ఇవే

అన్ని రకాల క్యాన్సర్లను పూర్తిగా అడ్డుకోలేకపోయినా, కొన్ని లైఫ్‌స్టైల్ మార్పుల ద్వారా ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు.

• మీ రోజువారీ ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు ఉండేలా చూసుకోండి.

• ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, బరువు పెరగకుండా కంట్రోల్ చేసుకోండి.

• క్యాన్సర్ నివారణకు సహాయపడే హెచ్‌పీవీ, హెపటైటిస్ బి వ్యాక్సిన్‌లను తీసుకోండి.

• వయస్సును బట్టి రెగ్యులర్ హెల్త్ చెకప్స్, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం చాలా అవసరం.

Read more Photos on
click me!

Recommended Stories