మనం పాటించే కొన్ని చిన్న చిన్న మంచి అలవాట్లు, మన ఆరోగ్యానికి పెద్ద మేలు చేస్తాయి. ముఖ్యంగా 11 రోజులపాటు ఖాళీ కడపుతో జీలకర్ర నీరు తాగడం వల్ల శరీరంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
జీలకర్రను మనం దాదాపు అన్ని రకాల వంటల్లో వాడుతుంటాం. జీలకర్ర చుడ్డానికి చిన్నగా ఉన్నా, ఆరోగ్యానికి మాత్రం పెద్దమేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగడం వల్ల శరీరంలో ఊహించని మార్పులు జరుగుతాయని వివరిస్తున్నారు. వరుసగా 11 రోజుల పాటు జీలకర్ర నీరు తాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలేంటో చూద్దాం.
26
మెరుగైన జీర్ణక్రియ
ఆరోగ్య నిపుణుల ప్రకారం జీలకర్రలో ఉండే సహజ నూనెలు, యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. 11 రోజులు వరుసగా ఉదయాన్నే జీలకర్ర నీరు తాగితే గ్యాస్, పొట్ట ఉబ్బరం, మలబద్ధకం వంటి సాధారణ జీర్ణ సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ముఖ్యంగా ఆలస్యంగా భోజనం చేసే వారు లేదా ఎక్కువగా కూర్చొని పని చేసేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని నిపుణలు చెబుతున్నారు.
36
జీవక్రియ రేటు
నిపుణుల ప్రకారం జీలకర్ర నీరు, జీవక్రియ రేటును పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దానివల్ల ఆహారం నుంచి పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారు 11 రోజులు ఈ అలవాటు పాటిస్తే మంచి ఫలితాలు చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని పరిశోధనల ప్రకారం జీలకర్రలో ఉండే కొన్ని సమ్మేళనాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. దానివల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది డయాబెటిస్‌కు చికిత్స కాదు అనే విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. షుగర్ వ్యాధి ఉన్నవారు మందులు మానేయకుండా, డాక్టర్ సలహాతో జీలకర్ర నీటిని తాగవచ్చని చెబుతున్నారు.
56
ఈ సమస్యలు దూరం
జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి.. కణాల నష్టాన్ని, ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాదు 11 రోజుల పాటు వరుసగా ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగడం వల్ల కొంతమందిలో తలనొప్పి, చిన్న చిన్న శరీర నొప్పులు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
66
శరీరానికి తేమ
ఉదయం లేవగానే గోరువెచ్చని జీలకర్ర నీరు తాగడం వల్ల రాత్రంతా విశ్రాంతిలో ఉన్న శరీరానికి తేమ అందుతుంది. ఇది కిడ్నీలు, కాలేయం పనితీరుకు సహకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే జీలకర్ర నీటిని ఎలా తాగాలి అనే విషయంలో కూడా నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ జీలకర్రను రాత్రంతా నానబెట్టి, ఉదయం మరిగించి గోరువెచ్చగా తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ మోతాదులో తాగడం మంచిది కాదని, అలాగే గర్భిణీలు, తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు లేదా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ముందుగా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిదని హెచ్చరిస్తున్నారు.