మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జ్యూస్ లను తప్పకుండా తాగండి

Published : Aug 06, 2023, 01:03 PM IST

మూత్రం లేదా మూత్రపిండాలలో రాళ్లు, నొప్పి నివారణ మందులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే మూత్రపిండాల వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించడానికి కొన్ని ఆహారాలు ఎంతో సహాయపడతాయి. అవేంటంటే.. 

PREV
14
మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జ్యూస్ లను తప్పకుండా తాగండి

మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతినడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి వ్యాధులు కూడా కొన్నికొన్ని సార్లు మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తాయి. మూత్రపిండాల వ్యాధులకు కారణమవుతాయి. మూత్రం లేదా కిడ్నీల్లో రాళ్లు ఉండటం, నొప్పి నివారణ మందులను ఎక్కువగా వేసుకోవడం వంటి వాటివల్ల కూడా మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. నిపుణులు ప్రకారం.. కొన్ని రకాల జ్యూస్ లు మన మూత్రపిండాలను ఆరోగ్యం, ఎలాంటి రోగాలు రాకుండా ఉండేందుకు సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

24

పైనాపిల్ జ్యూస్

పైనాపిల్ జ్యూస్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.  పైనాపిల్ లో పొటాషియం చాలా తక్కువగా ఉంటుంది. ఇవి మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అందుకే మీ మూత్రపిండాల ఆరోగ్యం కోసం వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి. 

34

బెర్రీ స్మూతీ

బెర్రీ స్మూతీ లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బెర్రీలు కిడ్నీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలతో చేసిన పానీయాలు తాగడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. 

44

ಬೀಟ್ ರೂಟ್ ನಲ್ಲಿ ಹೆಚ್ಚಿನ ಪ್ರಮಾಣದ ಪೋಷಕಾಂಶಗಳು ಇದ್ದು, ಕೊಬ್ಬಿನ ಅಂಶವು ತುಂಬಾ ಕಡಿಮೆ ಇರುತ್ತದೆ. ಇದು ನಿಮ್ಮ ತೂಕದ ಮೇಲೆ ಯಾವುದೇ ಋಣಾತ್ಮಕ ಪರಿಣಾಮ ಬೀರುವುದಿಲ್ಲ. 

క్యారెట్ జ్యూస్

క్యారెట్ జ్యూస్ కూడా మూత్రపిండాల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అధిక రక్తపోటు పేషెంట్లు కూడా రక్తపోటును తగ్గించడానికి, డయాబెటీస్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడే క్యారెట్లను ధైర్యంగా తినొచ్చు. క్యారెట్ జ్యూస్ ను కూడా రెగ్యులర్ గా తాగొచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories