వర్షాకాలంలో గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించే ఎఫెక్టివ్ చిట్కాలు

Published : Aug 05, 2023, 03:47 PM IST

వర్షాకాలంలో గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాను పాటిస్తే మీరు వర్షాకాలంలో మీ జీర్ణవ్యవస్థనే కా, మీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.  

PREV
17
 వర్షాకాలంలో గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించే ఎఫెక్టివ్ చిట్కాలు

వర్షాకాలంలో లేని పోని రోగాలు అంటుకుంటుంటాయి. ముఖ్యంగా జీర్ణశయాంతర సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. తేమతో కూడిన వాతావరణం వ్యాధికారకాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఆహార కాలుష్యం, అంటువ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ సీజన్ లో జీర్ణ సమస్యలను నివారించడానికి, గట్ ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని పెంచడానికి, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలను పాటించడం చాలా అవసరం. ఈ సీజన్ లో కొన్ని చిట్కాలను పాటిస్తే గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉంటాయి. అవేంటంటే?
 

27

చెడు ఆహారాలు 

ఎక్కువ తేమ కారణంగా.. ఆహారాలు చాలా త్వరగా చెడిపోయే అవకాశం ఉంది. అందుకే తాజా ఉత్పత్తులు, ఆహారాలను మాత్రం తినండి. అలాగే వాటిని ఎక్కువసేపు నిల్వ చేయకండి. ఎక్స్ పైరీ డేట్ అయిన లేదా మిగిలిపోయిన ఆహారాన్ని తినడం మానుకోండి.

37
Image: Getty

స్ట్రీట్ ఫుడ్ 

వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ ను తినే వారు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే ఇవి టేస్టీగా ఉంటాయి. కానీ ఈ సీజన్ లో స్ట్రీట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్.. ఆహారం ద్వారా వచ్చే అంటువ్యాధులకు కారణమవుతుంది. ఈ సీజన్ లో ఇంట్లో వండిన ఆహారాన్నే తినండి. 

47
Image: Getty

హైడ్రేటెడ్ గా ఉండండి

హైడ్రేట్ గా ఉండటానికి రోజంతా శుభ్రమైన, ఫిల్టర్ చేసిన నీటిని పుష్కలంగా తాగాలి. జీర్ణక్రియ, శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి సరైన ఆర్ద్రీకరణ చాలా ముఖ్యం. అందుకే ఈ సీజన్ లో నీటిని ఎక్కువగా తినండి.
 

57
Image: Getty

వ్యక్తిగత పరిశుభ్రత

వర్షాకాలంలో పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం. ఏమాత్రం అపరిశుభ్రంగా ఉన్నా అంటువ్యాధులు, ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే మీ చేతులను సబ్బు, నీటితో తరచుగా కడుక్కోండి.  ముఖ్యంగా భోజనానికి ముందు.
 

67
Image: Getty

ప్రోబయోటిక్స్, పులియబెట్టిన ఆహారాలు

ప్రోబయోటిక్స్, సౌర్క్రాట్ వంటి పులియబెట్టిన ఆహారాలను మీ రోజువారి ఆహారంలో చేర్చండి. ఈ ఆహారాల్లో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా సమృద్ధిగా ఉంటుంది. ఇవి మీ గట్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాదు రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తాయి. ఇది హానికరమైన వ్యాధికారక కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. 
 

77
Image: Getty

రోగనిరోధక శక్తిని పెంచే మూలికలు

ఎచినాసియా, ఆండ్రోగ్రాఫిస్, వేప, తులసి వంటి రోగనిరోధక శక్తిని పెంచే మూలికలను రోజూ తీసుకోండి. ఈ మూలికలు శక్తివంతమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి వ్యాధికారక కారకాలతో పోరాడటానికి, మీ జీర్ణవ్యవస్థను రక్షించడానికి సహాయపడతాయి.
 

Read more Photos on
click me!

Recommended Stories