నిమ్మకాయ తొక్కని మనం తరచూ పడేస్తాం. కానీ దానిలో ఎన్నో ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? దాని ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాల గురించి తెలిస్తే, మీరు ఇకపై దాన్ని పడేయడం మానేస్తారు.
నిమ్మ తొక్కలో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
25
ఎముకల బలోపేతం
నిమ్మ తొక్కలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఎముకల దృఢత్వానికి దోహదపడుతుంది. ఎముకల సాంద్రతను పెంచడానికి, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి నిమ్మ తొక్క సహాయపడుతుంది.
35
క్యాన్సర్ నివారణ
నిమ్మ తొక్కలోని ఫ్లేవనాయిడ్లు, లిమోనాయిడ్లు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, కణాలకు కలిగే నష్టాన్ని నివారిస్తాయి.
45
కొలెస్ట్రాల్
నిమ్మ తొక్కలో పాలీఫెనాల్స్, ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
55
ఎలా వాడాలి?
నిమ్మ తొక్కను తురిమి సలాడ్లు, పెరుగు, సూప్‌లు, బేకింగ్ వస్తువులు, కూరల్లో వాడొచ్చు. ఎండబెట్టి పొడి చేసి టీ, స్మూతీలు లేదా కాక్‌టెయిల్స్‌లో వాడొచ్చు. నిమ్మ తొక్కను నీటిలో మరిగించి టీ తయారు చేసుకోవచ్చు. చికెన్, చేప వంటి వాటిని వండేటప్పుడు నిమ్మ తొక్కను కూడా వేసి రుచి, ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు.