Muskmelon: ప్రకృతి ప్రసాదించిన వరం ఈ పండు, రోజూ తింటే జరిగే మ్యాజిక్ ఇదే..!

Published : Mar 19, 2026, 12:46 PM IST

Muskmelon: వేసవిలో లభించే పండ్లలో ఖర్బుజా అత్యంత ఆరోగ్యకరమైనది. ఎండల వేడి నుండి శరీరాన్ని రక్షించుకోవడానికి ఇది ప్రకృతి ప్రసాదించిన వరం. మరి ఈ పండును రోజూ తింటే ఎలాంటి లాభం కలుగుతుందో తెలుసా? 

PREV
13
Muskmelon

ఖర్బుజా కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, ఇది ఒక అద్భుతమైన న్యూట్రియంట్ పవర్ హౌస్. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ,శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి.

ఖర్బుజా పండులో పోషకాలు..

ఖర్బుజా పండులో 90శాతం నీరు ఉంటుంది. అంతేకాదు.. అతి తక్కువ కేలరీలు, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ఫోలేట్, మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.

23
ఎండాకాలంలో ఖర్బుజా పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

1.డీహైడ్రేషన్ నుంచి రక్షణ..

ఖర్బుజాలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. వేసవిలో చెమట రూపంలో శరీరం కోల్పోయే నీటిని ఇది తిరిగి భర్తీ చేస్తుంది. ముఖం వాడిపోకుండా, చర్మం తేమగా ఉండటానికి ఇది సహాయపడుతుంది.

2.శరీర వేడిని తగ్గిస్తుంది...

ఇది సహజమైన కూలెంట్ గా పని చేస్తుంది. ఎండ దెబ్బ తగల కుండా శరీరాన్ని లోపలి నుంచి చల్లపరుస్తుంది. మధ్యాహ్న సమయంలో దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

3. జీర్ణక్రియకు మేలు (Digestion)

వేసవిలో జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఖర్బుజాలో పీచు పదార్థం (Fiber) పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని వదిలించి, పొట్టను తేలికగా ఉంచుతుంది.

33
4. రోగనిరోధక శక్తి (Immunity)

ఇందులో విటమిన్ సి (Vitamin C) , విటమిన్ ఏ (Vitamin A) మెండుగా ఉంటాయి. ఇవి వేసవిలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడి, తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి.

5. రక్తపోటు నియంత్రణ (Blood Pressure)

ఖర్బూజలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

6. కంటి చూపు మెరుగుపడుతుంది

ఇందులోని బీటా-కెరోటిన్ కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, వయసు రీత్యా వచ్చే కంటి సమస్యలను తగ్గిస్తుంది.

ఖర్బుజా పండును ఎలా తినాలి..?

మీరు ఈ పండును ముక్కలుగా కోసుకొని, దానిపై కొద్దిగా నిమ్మరసం పిండుకొని సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. జ్యూస్ రూపంలో అయినా తీసుకోవచ్చు. అయితే.. అందులో పంచదార కలుపుకోకపోవడమే మంచిది. కేవలం ఈ పండు మాత్రమే కాదు.. ఖర్బుజా గింజలు కూడా చాలా మేలు చేస్తాయి.ఈ పండు గింజలను ఎండ పెట్టి.. డబ్బాలో స్టోర్ చేసుకొని ఏడాది మొత్తం తీసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories