Rice: ఒక్క రైస్‍తోనే ఇన్ని వంటలా? ఈ ఐడియాతో అసలు బోర్ కొట్టదు

Published : Mar 18, 2026, 04:55 PM IST

Rice: అందరి ఇళ్లలో రోజూ ఉండేదే రైస్. అందులోనూ సౌత్ ఇండియన్స్ ఫ్యామిలో తప్పనిసరిగా ఉంటుంది. మరి అదే రైస్ రోజూ తినాలంటే బోర్ కొడుతుందా? అయితే ఈ ఐడియతో డజన్ల కొద్దీ రెసిపీస్ చేసుకోవచ్చు. 

PREV
16
రైస్‍తోనే డజన్ల కొద్దీ వంటలు

దక్షిణ భారతదేశంలో వాతావరణం కారణంగా ఇక్కడ వరి పంటకు అనుకూలం. అందుకే ముఖ్యమైన ఆహారం అన్నం. కానీ రోజూ అదే తింటూ ఉంటే బోర్ కొడుతుందా? పిల్లలు, ఆఫీస్‍కు వెళ్లేవాళ్లు లంచ్ బాక్స్ లో రైస్ పెడుతుంటే విసిగిపోతున్నారా? అలా అని ప్రతిసారీ టిఫిన్స్ తింటే శరీరానికి శక్తి అందదు. అయితే ఈ ఒక్క రైస్‍తోనే డజన్ల కొద్దీ వంటలు చేసుకోవచ్చని తెలుసా? ఈ ఐడియా తెలిస్తే రైస్ తినడానికి బోర్ ఫీలవ్వరు. పిల్లలు కూడా ఎగబడి తింటారు. మరి అవెంటో చూసేద్దాం….

26
లెమన్ రైస్, పులిహోర, కొబ్బరి అన్నం, టమాట రైస్

చిన్న చిన్న మార్పులు చేస్తే అదే అన్నం కొత్త రుచితో మీ ముందుంటుంది. కాస్త క్రియేటివిటీ ఉంటే ప్రతిరోజు కొత్త డిష్ ట్రై చేయొచ్చు. ఒకే రైస్‍తో ఎన్నో ఫ్లేవర్స్. అన్నం రెడీ అయ్యాక బోలెడన్నీ ఈజీ రెసిపీస్ చేసేయొచ్చు. లెమన్ రైస్, పులిహోర, కొబ్బరి అన్నం, టమాట రైస్, జీలకర్ర రైస్, ఎగ్ రైస్ తయారు చేయొచ్చు. ఇవన్నీ తక్కువ సమయంలో అయ్యే ఐటమ్స్. లంచ్, ట్రావెల్, పిల్లలకు ఇవి బెస్ట్. 

36
బ్రేక్ ఫాస్ట్ కూ డా రైస్‍తోనే

అన్నం మిగిలిపోయిందని పడేయక్కర్లేదు. దాన్ని చక్కగా దద్దోజనం చేసేయొచ్చు. సింపుల్ టేస్టీ బ్రేక్ ఫాస్ట్ రెడీ అయిపోద్ది. మిగిలిన అన్నంలో కొంచెం పెరుగు, లేదా నీళ్లు వేసి 6 నుంచి 8 గంటలు నాననివ్వాలి. దీంతో అది లైట్‍గా పులుస్తుంది. తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండితో దోశలు, ఊతప్పం, గుంటపుంగనాలు చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు, ఉల్లిపాయ, కరివేపాకు, మిర్చి వేసుకుంటే ఇంకాస్త రుచి అదిరిపోద్ది.ఇడ్లీ చేయాలనుకున్నప్పుడు పిండి కాస్త గట్టిగా ఉండేలా చూసుకోవాలి. అంతే మిగిలిన అన్నంతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్ రెడీ.

46
సాయంత్రం స్నాక్స్ టైంలో కూడా రైస్

సాయంత్రం టైంలో టీతో పాటు స్నాక్స్ కావాల్సిందే. అలాంటప్పుడు ఎప్పుడూ పకోడీలు, మిర్చి బజ్జీలు ఏం తింటారులే. కాస్త ఇలా ట్రై చేయండి. రైస్ లేదా రైస్ పిండితో వడలు, పకోడీలు, మురుకులు చేసుకోవచ్చు. ఇవి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. 

56
రైస్‍తో స్వీట్స్ రెడీ

పరమాన్నం, చక్రపొంగలి, హల్వా లాంటి స్వీట్స్ చేసుకోవచ్చు, పండుగల్లో ఇవి వెరీ స్పెషల్. సులువుగా అయిపోతాయి కూడా. 

66
స్పెషల్ వంటలు

మీకు కాస్త టైం ఉంటే బిర్యానీ , కిచిడీ, పొంగల్..ఇలా ప్రత్యేకమైన వంటలు కూడా మీ ముందుంటాయి. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. ఒక్కరే కాకుండా ఫ్యామిలీ మొత్తం లాగించేయొచ్చు. రైస్ సింపుల్ కాదు..మీ ఐడియా, మీ చేసే విధానంపై రుచి ఇంకా పెరిగిద్ది. ఒకసారి ట్రై చేయండి. 

Read more Photos on
click me!

Recommended Stories