నల్ల నువ్వులు మన ఆరోగ్యానికి ఓ వరం.. వీటిని తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

First Published | Oct 17, 2023, 2:00 PM IST

నల్ల నువ్వుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ చిన్న గింజలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. చలికాలంలో వీటిని ఎక్కువగా తింటుంటారు. ఆయుర్వేదంలో ఈ విత్తనాలను ఔషధంగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ విత్తనాలు మన శరీరాన్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడతాయి.
 

పోషకాలు ఎక్కువగా ఉండే నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాధారణంగా నువ్వులు రెండు రకాలు ఉంటాయి.  ఒకటి తెల్లనువ్వులు, రెండు నల్ల నువ్వులు.  రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నువ్వులను ఆహారంలో ఎన్నో విధాలుగా ఉపయోగిస్తారు. వీటితో ఎన్నో రకాల వంటలను తయారుచేస్తారు. నువ్వుల లడ్డు టేస్టీగా ఉండటంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా బోలెడు ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. నల్ల నువ్వుల్లో కాల్షియం, ఫైబర్, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా అవసరం. నల్ల నువ్వులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.  అలాగే జుట్టు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అసలు నల్ల నువ్వులను తింటే మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

యాంటీ ఆక్సిడెంట్ల మూలం

నల్ల నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తుంది. నల్ల నువ్వులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ఈ విత్తనాల్లో ఉండే గుణాలు మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులను కూడా తగ్గిస్తాయి.


గుండె ఆరోగ్యం 

నల్ల నువ్వుల్లో పాలీ అన్శాచురేటెడ్ కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
 

జీర్ణ సమస్యలు దూరం 

నల్ల నువ్వుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ప్రేగు కదలిక ప్రక్రియ సులభం అవుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి నల్ల నువ్వులు దివ్యౌషధంలా పనిచేస్తాయి.
 

మెదడుకు మేలు

నల్ల నువ్వులు పోషకాల నిధి. వీటిలో విటమిన్ బి6, మెగ్నీషియంతో పాటుగా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిలో ఉండే గుణాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నల్ల నువ్వులను తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

కాలేయ ఆరోగ్యం

నల్ల నువ్వులను మన ఆహారంలో ఎన్నో విధాలుగా ఉపయోగిస్తారు. ఇవి శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇవి మన కాలేయాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే మీ రోజువారీ ఆహారంలో నల్ల నువ్వులను పరిమిత పరిమాణంలో ఉపయోగించండి.

రోగనిరోధక వ్యవస్థ బలోపేతం

పోషకాలు పుష్కలంగా ఉండే నల్ల నువ్వులు రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడానికి సహాయపడతాయి. వీటిలో ఉండే క్యాల్షియం, కాపర్, మాంగనీస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో మీకు ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు దూరంగా ఉంటాయి. 

Latest Videos

click me!