ఎముకలు బలంగా ఉండాలంటే వీటిని రోజూ తినండి

First Published | Oct 16, 2023, 2:51 PM IST

హెల్తీ ఫుడ్ మనల్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతుంది. ఫుడ్ తో మన ఎముకలను కూడా బలంగా చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అవును కొన్నిరకాలా ఆహారాలను తింటే బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తప్పుతుంది. 

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎముకల సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఎముకల బలహీనత చాలా మందిని వేధిస్తోంది. ఈ సమస్యకు ప్రధాన కారణం కొన్ని రకాల పోషకాల లోపమేనంటున్నారు నిపుణులు. మన ఎముకలు, దంతాలు, కండరాలు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, ఖనిజాలు మొదలైనవి ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. మరి మన ఎముకలు బలంగా ఉండటానికి ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

నువ్వులు

నువ్వులను ఏ కూరలో వేసినా.. టేస్ట్ అదిరిపోతుంది. నిజానికి నువ్వులు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీ రోజువారి ఆహారంలో నువ్వులు, చియావిత్తనాలు వంటి విత్తనాలను చేర్చండి. వీటిలో ఉండే క్యాల్షియం ఎముకలను బలంగా, ఆరోగ్యం ఉంచుతుంది. 
 


బాదం పప్పులు

రోజూ గుప్పెడు బాదం పప్పులను తింటే మీరు ఎన్నో రోగాలకు దూరంగా ఉండొచ్చంటారు నిపుణులు. బాదం పప్పులు పోషకాలకు మంచి మూలం. వీటిలో కాల్షియం, మాంగనీస్, విటమిన్ ఇ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి. 

పాల ఉత్పత్తులు

పాలు, పెరుగు, జున్ను, పెరుగు వంటి పాల ఉత్పత్తుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే ఎముకలు బలహీనంగా ఉన్నవారు పాల ఉత్పత్తులను రోజువారి డైట్ లో చేర్చుకుంటే మంచిది. 

వెల్లుల్లి

వెల్లుల్లి మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని తింటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాదు ఇవి మన ఎముకలను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. 

pulses

పప్పుధాన్యాలు

పప్పుధాన్యాలు పోషకాల బాంఢాగారం. ఇవి మన  శరీరానికి అవసరమైన పోషకాలను పుష్కలంగా అందిస్తాయి. జింక్ ఎక్కువగా ఉండే చిక్కుళ్లను మీ ఆహారంలో చేర్చడం వల్ల కూడా మీ ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. 
 

బచ్చలికూర

బచ్చలికూర వంటి ఆకుకూరలు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ కె, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం.  కాబట్టి వీటిని కూడా మీ డైట్ లో చేర్చుకోండి. 

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్లను తినని వారుండరు. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇవి సెక్స్ డ్రైవ్ ను పెంచడం నుంచి ఒత్తిడిని తగ్గించడం వరకు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే డార్క్ చాక్లెట్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. 

Latest Videos

click me!