తప్పుడు ఆహారం, మారుతున్న జీవనశైలి వల్ల చాలా మంది జీర్ణసమస్యలతో బాధపడుతున్నారు. వీటిలో విరేచనాలు కూడా ఒకటి. ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేసే ఒక సాధారణ జీర్ణశయాంతర సమస్య. దీనివల్ల నీరసంగా మారడమే కాకుండా ఏ పనులనూ చేయలేరు. అంతే కాదు.. ఈ సమస్య ఎక్కువైతే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే దీన్ని సకాలంలో తగ్గించుకోవాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని ఆహారాలు విరేచనాలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. అవేంటంటే..
అరటి
అరటిపండ్లలో పొటాషియం, పెక్టిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి విరేచనాలను నివారించడానికి, ఎలక్ట్రోలైట్ల లోపాన్ని పోగొట్టడానికి సహాయపడతాయి. అలాగే అరటిపండ్లను తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. కడుపు కూడా రిలాక్స్ అవుతుంది.
పప్పు కలిపిన అన్నం
మీకు లూజ్ మోషన్ సమస్య ఉంటే.. బియ్యం , పెసర పప్పు తో చేసిన కిచిడీ ని తినండి. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది సులభంగా తయారు చేయగలిగే, త్వరగా జీర్ణమయ్యే వంటకం. ఇది మీ శరీరానికి కావాల్సిన శక్తి కూడా అందిస్తుంది. అలాగే ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. ఈ కిచిడీ కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణ సమస్యలు వచ్చినప్పుడు తరచూ దీన్ని తినడం మంచిది.
ఉడికించిన బంగాళాదుంపలు
విరేచనాలు ఉన్నప్పుడు ఉడకబెట్టిన బంగాళాదుంపలు తినడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే శక్తి, కార్బోహైడ్రేట్లు లభిస్తాయి, ఎందుకంటే అవి సులభంగా జీర్ణమవుతాయి. అయినప్పటికీ వీటిని తయారు చేసేటప్పుడు ఎక్కువ నూనె లేదా సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం మానుకోండి.
పెరుగు
పెరుగులో కనిపించే ప్రోబయోటిక్స్ గట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. విరేచనాలు ఉన్నప్పుడు సాదా పెరుగును తినండి. దీనిలో చక్కెర, ఉప్పు వంటివి మిక్స్ చేయకూడదు.
దానిమ్మ
దానమ్మలోని ఆస్ట్రిజెంట్ లక్షణాలు విరేచనాలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇలాంటిప్పుడు మీరు దానిమ్మ గింజలు లేదా రసాలను తాగొచ్చు. వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మంటను తగ్గించడానికి సహాయపడతాయి.
కొబ్బరి నీరు
కొబ్బరి నీరు మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉండటానికి ఎంతో సహాయపడుతుంది. ఇది సహజ ఎలక్ట్రోలైట్ కు గొప్ప మూలం. కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.