పాల ప్యాకెట్ నీలి రంగులో ఉంది అంటే.. ఆ ప్యాకెట్ లో ‘టోన్డ్ మిల్క్’ ఉంటాయి. వీటిలో 3 శాతం కంటే తక్కువ ఫ్యాట్ ఉంటుంది. పాలల్లో నుంచి ఫ్యాట్ తీసేసి.. ఆ పాలను ఈ కలర్ ప్యాకెట్ లో అమ్ముతారు.
అదే ఆరెంజ్ రంగులో లేదా మెజెంటా రంగులో ఉండే పాల ప్యాకెట్ లో ఫుల్ క్రీమ్ పాలు ఉంటాయి. అంటే.. ఈ పాలల్లో మీగడ చాలా ఎక్కువగా ఉంటుంది. తక్కువలో తక్కువ 6 శాతం ఫ్యాట్ ఉంటుంది.
ఆకుపచ్చ పాల ప్యాకెట్ లో తాజా పాలు ఉంటాయి. అంటే, ఈ పాలల్లో 4.5 శాతం ఫ్యాట్స్, 8.5 శాతం SNF ఉంటాయి. ఇక, మన దేశంలో చాలా కంపెనీలు.. ఫ్యాట్ తక్కువగా ఉన్న పాలను పసుపు రంగు ప్యాకెట్లలో కూడా అమ్ముతుంటారు.
ఈ రంగులు ఎందుకు..?
పాలు కొనుక్కునే వినియోగదారులు.. ప్యాకెట్ మీద రాసి ఉన్న అక్షరాలు చూసి అందులో ఎలాంటి పాలు ఉంటాయి అని చదవాల్సిన అవసరం లేకుండా, కేవలం కలర్ చూసి.. ఏ పాలు కావాలో కొనుక్కోవడానికి సులువుగా ఉండేందుకు ఇలా రంగులు కేటాయించారు.
మన దేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లో కూడా పాల రకాలను గుర్తించడానికి రంగులు ఉపయోగిస్తారు. బ్రిటన్, అనేక యూరోపియన్ దేశాలలో, ఫుల్ క్రీమ్ ఉన్న పాలు నీలిరంగు ప్యాకెట్ లో, పాక్షికంగా ఫ్యాట్ తీసిన పాలు ఆకు పచ్చ రంగులో లభిస్తాయి. ఇంటర్నేషనల్ డైరీ ఫుడ్స్ అసోసియేషన్ ప్రకారం, అమెరికాలో ఫుల్ క్రీమ్ పాలు ఎరుపు రంగులో, తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు బ్లూ కలర్ లో లభిస్తాయి.