డయాబెటీస్ పేషెంట్లు ఎలాంటి సలాడ్ తింటే మంచిది?

First Published | Jun 6, 2023, 11:40 AM IST

సలాడ్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. దీనిని అందరూ తినొచ్చు. మరి డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండాలంటే వీరు ఎలాంటి సలాడ్లను తినాలంటే? 
 

సలాడ్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. సలాడ్ పండ్లు లేదా కూరగాయలతో తయారైనప్పటికీ.. దీనిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. నిజానికి మనం సలాడ్ ను తినేటప్పుడు దానిలోని అన్ని ఆహారాలను తింటాం. దీని వల్ల మన శరీరానికి ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే డయాబెటిక్ పేషెంట్లు మాత్రం సలాడ్ ను ఎక్కువగా తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే.. 

డయాబెటిస్ ఉన్నవారికి సలాడ్ ను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నిజానికి సలాడ్ లో ఎక్కువ మొత్తంలో రఫేజ్, ఫైబర్ లు ఉంటాయి. ఇవి చక్కెర జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఇవి ప్యాంక్రియాస్ పనితీరును పెంచుతాయి. అలాగే చక్కెరను జీర్ణం చేసే ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇది కాకుండా డయాబెటిస్ ఉన్నవారిలో మలబద్దకం సమస్యను తగ్గించడానికి, చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇవి సహాయపడతాయి. మధుమేహులకు ఏ సలాడ్ మంచిదంటే? 
 


గ్రీన్ సలాడ్

షుగర్ పేషెంట్లకు గ్రెయిన్ సలాడ్ తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా బ్రొకోలీ, క్యారెట్, ముల్లంగి, బీట్ రూట్, దోసకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, మిరపకాయలతో సలాడ్ తయారు చేసుకోవాలి. దీన్ని తినండి. అయితే దీనిని మీరు రెండు పద్దతుల్లో తినండి. ఒకటి సగం వేయించినది, రెండో పచ్చిగా.
 

salad

మొలకలు సలాడ్

మొలకలు మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి. ఎందుకంటే వీటిలో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ ను పెంచడంతో పాటుగా ఇవి ఆకలిని నియంత్రణలో ఉంచుతాయి. డయాబెటిస్ ఉన్నవారిలో జీవక్రియను సరిగ్గా ఉంచుతాయి. శనగపప్పు, పెసరపప్పు, మెంతులను మీకు నచ్చిన విధంగా నానబెట్టి, ఆపై మొలక సలాడ్ ను తయారు చేసి తినండి. మీకు డయాబెటీస్ ఉంటే వీటిని  ఖచ్చితంగా తినండి. 

Latest Videos

click me!