thyroid
ప్రస్తుతం థైరాయిడ్ పేషెంట్ల సంఖ్య బాగా పెరిగిపోతోంది. థైరాయిడ్ గ్రంథి ఒక ముఖ్యమైన హార్మోన్ గ్రంథి. ఇది మన శరీరం జీవక్రియ, పెరుగుదల, అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది సక్రమంగా పనిచేయకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి.
సెంటర్స్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (సిడిసి) ప్రకారం.. థైరాయిడ్ గ్రంథిలో ఏదైనా సమస్య ఉంటే.. అది పనితీరును ప్రభావితం చేస్తుంది. శ్వాసక్రియ, జీర్ణక్రియ, మానసిక స్థితి, బరువు, హృదయ స్పందన రేటులో థైరాయిడ్ హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే దీనిని నియంత్రించడం చాలా ముఖ్యం. థైరాయిడ్ హార్మోన్లను నియంత్రించడానికి ఆహారం ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
సూడాన్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం .. ఆరోగ్యకరమైన థైరాయిడ్ పనితీరును నిర్వహించడానికి సమతుల్య ఆహారాన్ని తినడం చాలా ముఖ్యమని కనుగొన్నారు. అయితే థైరాయిడ్ సమస్యతో బాధపడేవారికి ఓట్ మీల్ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
నిపుణుల ప్రకారం.. ఓట్ మీల్ ను తీసుకోవడం వల్ల థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. థైరాయిడ్ ఉన్నవారికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఓట్స్ లో ఉన్నాయని పరిశోధనలో చెబుతున్నారు.
ఓట్స్ లో విటమిన్ బి, విటమిన్ ఇ, జింక్, రాగి, మెగ్నీషియం, ఇనుము పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. అలాగే వాటిని సమతుల్యంగా ఉంచుతాయి. థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి అవసరమైన అయోడిన్ కూడా ఓట్స్ లో పుష్కలంగా ఉంటుంది.
పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉండే ఓట్స్ శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే థైరాయిడ్ సంబంధిత స్వయం ప్రతిరక్షక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఓట్స్ సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
థైరాయిడ్ గ్రంథి పనితీరు సక్రమంగా ఉండేందుకు ఉత్తమ మార్గం మనం తినే ఆహారం. థైరాయిడ్ తో బాధపడేవారికి ఓట్స్ మంచి పోషకాహారం. ప్రతిరోజూ 30-50 గ్రాముల ఓట్ మీల్ ను తింటే మంచిని నిపుణులు చెబుతున్నారు. మీ రోజువారీ పోషక అవసరాలను తీర్చడానికి ఓట్స్ ను గంజి, ఓట్స్ స్మూతీలు, ఓట్స్ దోశగా తీసుకోవచ్చు.