ఇంట్లోనే ఉంటూ విటమిన్ డి లోపాన్ని తగ్గించుకోవాలంటే ఇలా చేయండి

First Published | Jun 16, 2023, 11:21 AM IST

సూర్యరశ్మి విటమిన్ డి కి మంచి వనరు. అయినప్పటికీ.. మండే ఎండల్లో బయటకు రావడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ శరీరంలో విటమిన్ డి లోపిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. 
 

vitamin d

విటమిన్ డి లోపాన్ని పోగొట్టుకోవడానికి సూర్యరశ్మి చాలా చాలా అవసరం. ఎందుకంటే సూర్యకిరణాల ద్వారా మన శరీరానికి విటమిన్ డి అందుతుంది. అయినప్పటికీ శీతాకాలంలో సూర్యరశ్మిని పొందడం, ఎండాకాలంలో ఎండకు దూరంగా ఉండటం మంచిది. దీనికి ప్రధాన కారణం ఎండాకాలంలో ఎండ విపరీతంగా కొడుతుంది. ఈ సూర్యకిరణాలు ఎన్నో చర్మ సమస్యలను కలిగిస్తాయి. శరీరానికి తగినంత సూర్యరశ్మి అందకపోతే విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. అయితే కొన్ని ఆహారాలతో ఈ విటమిన్ డి  లోపాన్ని పోగొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గుడ్డు

గుడ్లు సంపూర్ణ ఆహారం. గుడ్లను తింటే ఎన్నో రకాల పోషక లోపాలు తొలగిపోతాయి. విటమిన్ డి లోపాన్ని నివారించడానికి మీరు మీ బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లను తినండి. ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా ఉండే గుడ్డు పచ్చసొన శరీరంలోని  విటమిన్ డి లోపాన్ని తొలగిస్తుంది.
 

Latest Videos


Image: Getty Images

పుట్టగొడుగు

పుట్టగొడుగులు తినడం వల్ల శరీరంలోని విటమిన్ డి లోపాలు తొలగిపోతాయి. విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి శాకాహారులకు పుట్టగొడుగులు ఆరోగ్యకరమైన  ఆహారం. పుట్టగొడుగుల కూరగాయలు, సూప్, శాండ్విచ్లు అన్నీ టేస్టీగా ఉంటాయి. వీటిని తిన్నా విటమిన్ డి లోపం పోతుంది.

బచ్చలికూర

ఎన్నో విధాలుగా తయారుచేసి తినగలిగే ఆకుకూరల్లో బచ్చలికూర ఒకటి. బచ్చలికూరలో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూరను తినడం వల్ల శరీరానికి విటమిన్ డి అందుతుంది. అందుకే మీరు బచ్చలికూరతో పాటుగా ఇతర ఆకుపచ్చ కూరగాయలను మీ ఆహారంలో చేర్చండి. 
 

Image: pexel

పాలు

పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి  ఒక్కరూ పాలు తాగాలి. ఇది ఒక సంపూర్ణ ఆహారం. పాలు శరీరంలో క్యాల్షియం లోపాన్ని తీరుస్తాయి. దీనితో పాటు విటమిన్ డిని కూడా అందిస్తుంది. అందుకే పాలను మీ డైట్ లో చేర్చుకోండి. పాలు మీ ఎముకలను కూడా బలంగా ఉంచుతాయి. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

click me!