star fruit
స్టార్ ఫ్రూట్ రుచి అద్బుతంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో లక్షణాలు కూడా ఉన్నాయి. కానీ ఈ పండును తినే వారు చాలా తక్కువే. అందులోనూ ఈ పండ్లను కొనేవారు కూడా తక్కువే. దీనికంతటికీ కారణం.. ఈ పండ్ల ప్రయోజనాల గురించి తెలియకపోవడమే. అసలు ఈ పండు ఎన్నో రోగాలను తగ్గిస్తుంది తెలుసా? ఈ పండును తింటే మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బీపీ కంట్రోల్
ఈ స్టార్ ఫ్రూట్ లో పొటాషియం, ఫైబర్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అధికక రక్తపోటును నియంత్రించడానికి ఎంతో సహాయపడతాయి. అందుకే ఈ పండును బీపీ పేషెంట్లు ఎంచక్కా తినొచ్చు.
Star Fruit
కొలెస్ట్రాల్
ఈ స్టార్ పువ్వు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. స్టార్ పువ్వులో ఉండే ఫైబర్ తో సహా అనేక అంశాలు ఇందుకు సహాయపడతాయి. కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తే మీకు గుండె జబ్బుల ముప్పు తప్పుతుంది. అలాగే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
బరువు తగ్గాలంటే...
బరువు తగ్గాలనుకునే వారు ఈ పండును ఖచ్చితంగా డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండులో ఎక్కువగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఈ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే ఈ పండును తింటే బరువు పెరుగుతామనే భయం అక్కర్లేదు. ఈ లక్షణాలన్నీ బరువు తగ్గాలనుకునేవారికి బాగా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
చర్మం, జుట్టు కోసం..
స్టార్ ఫ్రూట్ కూడా విటమిన్-సి కి మంచి మూలం. అందుకే ఇది జుట్టుకు, చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు దీనిలో ఉండే విటమిన్ బి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
డయాబెటిస్ కోసం..
డయాబెటిస్ ఉన్నవారు పండ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పండ్లలో షుగర్ ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అయితే మధుమేహులు కొన్ని పండ్లను ఎంచక్కా తినొచ్చు. ఇలాంటి వాటిలో స్టార్ ఫ్రూట్ ఒకటి.