అన్నం, చపాతీ ఓకేసారి తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Jul 9, 2024, 3:31 PM IST

చాలా మంది ఒకటి రెండు చపాతీలు తిని, కాస్త అన్నం తింటుంటారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు అన్నం, చపాతీలు కలిపి తింటే ఏమౌతుందో ఎరుకేనా? 
 

మన ఆరోగ్యాన్ని కాపాడటంలోనే కాదు, పాడుచేయడంలో కూడా ఆహారం ముందుంటుంది. మన శరీరం హెల్తీగా, చురుగ్గా ఉండటానికి మంచి పోషకాహారం చాలా అవసరం. లేదంటే ఎన్నో రకాల వ్యాధులు నేరుగా మన శరీరంపైనే దాడి చేస్తాయి. ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కొంతమంది అన్నం తింటే బరువు పెరిగిపోతామని రాత్రిపూట చపాతీలనే తింటుంటారు. ఇంకొందరు చపాతీలతో పాటుగా అన్నాన్ని కూడా తింటుంటారు. 

కానీ అన్నాన్ని, చపాతీలను కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కదని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ చాలా మంది అన్నం, చపాతీలను కలిపి తింటే మన శరీరానికి చాలా పోషకాలు అందుతాయని నమ్ముతారు. కానీ ఈ రెండిండిని కలిపి తింటే ప్రయోజనాలకు బదులుగా నష్టాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అన్నం, చపాతీ రెండింటిలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అన్నం, చపాతీ ని ఒకేసారి తినకపోవడమే మంచిదంటారు నిపుణులు. అసలు ఈ రెండింటిని కలిపి తినడం వల్ల ఏం జరుగుతుందో  ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


షుగర్ లెవల్స్ లో మార్పు

అన్నం, చపాతీని కలిపి తినడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ వేగంగా పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రోజూ తింటే మీకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే అన్నం, చపాతీ కలిపి తినడం వల్ల డయాబెటీస్ పేషెంట్లకు కూడా మంచిది కాదు. ఇది వెంటనే మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. 
 

అజీర్ణం

అన్నం, చపాతీ కలిపి తింటే పేగుల కిణ్వ ప్రక్రియ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో  గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల అజీర్తి సమస్య వస్తుందట. అందుకే ఇలా తినకపోవడమే మంచిది.

కొలెస్ట్రాల్ ను పెంచుతుంది

అన్నం, చపాతీని కలిపి తింటే మీ శరీరంలో కార్బోహైడ్రేట్ల శోషణ మరింత పెరుగుతుంది. ఇది మీకు జీర్ణ సమస్యలు వచ్చేలా చేయడమే కాకుండా శరీరంలో మంటను కలిగిస్తుంది. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.

జీర్ణ సమస్య

అన్నం, చపాతీ రెండూ కార్బోహైడ్రేట్లకు మంచి వనరులు. కాబట్టి వీటిని కలిపి తింటే మీ జీర్ణవ్యవస్థపై అదనపు భారం పడుతుంది. ఇది గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. 0
 

అన్నం తినడానికి సరైన సమయం ఏది?

ఈ రెండింటినీ కనీసం 2 గంటల గ్యాప్ తో తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. మీరు అన్నం తిన్న తర్వాత చపాతీ తినాలకుంటే దీన్ని అన్నం తిన్న రెండు గంటల తర్వాత తినాలి.  మీరు ఒకేసారి ఒకటి మాత్రమే తినాలి. అంటే చపాతీ లేదా అన్నంలో ఒక్కటే తినాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరానికి రెండు ధాన్యాల నుంచి అన్ని పోషకాలు లభిస్తాయి. దీనివల్ల అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు కూడా రావు. 

Latest Videos

click me!