పుచ్చ గింజలు పారేస్తున్నారా..? వాటితో ఈజీగా బరువు తగ్గొచ్చు తెలుసా?

First Published | Jul 8, 2024, 11:39 AM IST

పుచ్చకాయ గింజల్లో పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. మరి... వీటిని ఎలా తీసుకుంటే బరువు ఈజీగా తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం...

watermelon seeds

పుచ్చకాయను ఎండాకాలంలో అందరూ ఎక్కువగా తింటూ ఉంటారు. ఎందుకంటే.. బయట ఎండలకు మనం కాస్త అయినా రిఫ్రెష్మెంట్ కలుగుతుంది కాబట్టి.. అదీ కాకుండా.. ఎవరికైనా అందుబాటు ధరలో ఉంటుంది. ఇప్పుడు సీజన్ మారింది. వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ వర్షాల్లో మనం పుచ్చకాయ తినలేం. కానీ... పుచ్చగింజలు తినొచ్చు. నిజానికి పుచ్చకాయ తినేటప్పుడు దాని గింజలను అందరూ పారేస్తూ ఉంటారు. కానీ... మీరు పారేస్తున్న ఆ పుచ్చగింజలే మన ఆరోగ్యంపై చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుందట.  ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేయడంతో పాటు... ఈజీగా బరువు కూడా తగ్గిస్తాయట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

seed

పుచ్చకాయ గింజల్లో పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. మరి... వీటిని ఎలా తీసుకుంటే బరువు ఈజీగా తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం...


బరువు తగ్గాలి అనుకునేవారు కచ్చితంగా తమ డైట్ లో  పుచ్చగింజలు చేర్చుకోవాలి.  పుచ్చకాయ గింజలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల కి  గొప్ప మూలం, ఇవి సమతుల్య ఆహారంలో విలువైన అదనంగా ఉంటాయి. పుచ్చకాయ గింజలలో ఉండే కొన్ని కీలక పోషకాలు ఇక్కడ ఉన్నాయి:

water melon

పుచ్చగింజల్లో మన శరీరానికి కావాల్సిన  అవసరమైన పోషకాలు చాలా నిండి ఉంటాయి. ప్రోటీన్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, మెగ్నీషియం, జింక్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జీవక్రియ, శక్తి స్థాయిలను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడతాయి.

water melon seed

పుచ్చ గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అవి ఒమేగా3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలతో  సహా అసంతృప్త కొవ్వులకు మంచి మూలం. ఇవి గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గించడంలో సహాయపడతాయి. 

పుచ్చకాయ గింజలలో విటమిన్ సి వంటి అవసరమైన విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, జింక్ , ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
 

ఎవరైనా సరే బరువు తగ్గాలి అంటే.. కచ్చితంగా ప్రోటీన్ తీసుకోవాలి. అలా మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ ఈ పుచ్చగింజలు మనకు అందిస్తాయి. ఆకలిని తగ్గిస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి. అంతేకాదు.. పుచ్చ గింజల్లో ఒమేగా3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మెదడు  ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. 

seed

అంతేకాకుండా.. ఈ పుచ్చ గింజల్లో  ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది దీనిలో డైటరీ ఫైబర్ ఉంటుంది. కాబట్టి.... జీర్ణ వ్యవస్థను నియంత్రించడంలో, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పుచ్చ గింజుల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి.. బరువు పెరిగిపోతాం అనే భయం ఉండదు.

melon

ఇప్పుడు వీటిని ఎలా తినాలో తెలుసుకుందాం.. నార్మల్ గా స్నాక్స్ లాగా ఈ పుచ్చగింజలు తినొచ్చు. కొంచెం ఆలివ్ నూనె వేసి.. వేయించి.. చిటికెడు ఉప్పు జత చేసి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. లేదు అంటే.. మీకు స్మూతీలు తాగే అలవాటు ఉంటే.. వాటిల వీటిని చేర్చి తీసుకోవచ్చు. సలాడ్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

Latest Videos

click me!