చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా రకాల ఆరోగ్య సమస్యలు చుట్టు ముడతాయి. ఈ కాలంలో మంచి ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం. అలా చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే సూపర్ ఫుడ్స్ లో గుమ్మడి గింజలు ముందు వరుసలో ఉంటాయి. వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
చలికాలం వచ్చిందంటే శరీరానికి ఎక్కువ శక్తి, రోగనిరోధక శక్తి అవసరం. ఈ సమయంలో సరైన ఆహారం తీసుకోకపోతే జలుబు, దగ్గు, అలసట వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటి సందర్భంలో ఆరోగ్య నిపుణులు సూచించే సూపర్ ఫుడ్‌లలో ఒకటి గుమ్మడి గింజలు. చిన్నగా కనిపించే ఈ గింజల్లో అపారమైన పోషకాలు దాగి ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
26
రోగనిరోధక శక్తి
చలికాలంలో గుమ్మడి గింజలు తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఈ గింజల్లో జింక్, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జింక్ శరీరంలో ఇమ్యూనిటీ సెల్స్‌ను యాక్టివ్‌గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తిస్తుంటాయి కాబట్టి, గుమ్మడి గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి కొంతవరకు రక్షణ లభిస్తుంది.
36
శరీరానికి అవసరమైన శక్తి
గుమ్మడి గింజలు శరీరానికి అవసరమైన ఎనర్జీని అందిస్తాయి. చలికాలంలో మెటబాలిజం కొంత మందగిస్తుంది. గుమ్మడి గింజల్లో ఉండే ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. అలసటగా అనిపించే వారికి, రోజంతా యాక్టివ్‌గా ఉండాలనుకునే వారికి ఇవి మంచి స్నాక్‌గా పనిచేస్తాయి. ముఖ్యంగా చదువుకునే పిల్లలు, ఆఫీస్‌కు వెళ్లే వారు మధ్యాహ్నం సమయంలో కొన్ని గుమ్మడి గింజలు తింటే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి.
చలికాలంలో చాలామందికి చర్మ సమస్యలు వస్తుంటాయి. గుమ్మడి గింజల్లో ఉండే విటమిన్ E, ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి తేమను అందించడంలో సహాయపడతాయి. రోజూ కొద్దిగా గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల చర్మం డ్రైగా మారకుండా ఉండటంతోపాటు కాంతివంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇవి జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయంటున్నారు.
56
మెరుగైన జీర్ణక్రియ
చలికాలంలో నీరు తక్కువగా తాగడం వల్ల కొందరికి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తుంటాయి. గుమ్మడి గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, పేగుల పనితీరును సక్రమంగా ఉంచుతుంది. ఇది కడుపు ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
66
గుండె ఆరోగ్యం
గుండె ఆరోగ్యానికి కూడా గుమ్మడి గింజలు మేలు చేస్తాయి. వీటిలో ఉండే మెగ్నీషియం, హెల్తీ ఫ్యాట్స్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. చలికాలంలో రక్తనాళాలు కొంత కుదించుకునే అవకాశం ఉండటంతో బీపీ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారు పరిమిత మోతాదులో గుమ్మడి గింజలు తినడం మంచిది. అంతేకాదు గుమ్మడి గింజల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ మంచి నిద్రకు కూడా సహాయపడుతుంది. అయితే గుమ్మడి గింజలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ అతిగా తినకూడదు.