కాకరకాయ
కాకరకాయ చేదుగా ఉంటుంది. అందుకే కొంతమంది దీన్ని అస్సలు తినరు. కానీ కాకరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ చేదు కూరగాయలో ఐరన్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి, మెగ్నీషియం, ఫోలేట్, జింక్, ఫాస్పరస్, మాంగనీస్, డైటరీ ఫైబర్స్, కాల్షియం మెండుగా ఉంటాయి. కాకరకాయను తింటే మన ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా కళ్లు, కాలెయం ఆరోగ్యంగా ఉంటాయి. ఈ కూరగాయ మధుమేహాన్ని నియంత్రించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.