అన్నం తింటే థైరాయిడ్ వస్తుందా?

First Published | Feb 24, 2024, 10:47 AM IST

ప్రస్తుత కాలంలో థైరాయిడ్ సర్వసాధారణ వ్యాధిగా మారిపోయింది. పెద్దలతో పాటుగా యువత కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. థైరాయిడ్ ఉన్నవారు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే చాలా మంది అన్నం తింటే థైరాయిడ్ పెరుగుతుందని అనుకుంటారు. మరి దీనిలో నిజమెంతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

అన్నాన్నే మూడు పూటలా తినేవారున్నారు. అన్నంలో కార్భోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అన్నం మనల్ని శక్తివంతంగా ఉంచుతుంది. అలాగని అన్నాన్ని మరీ ఎక్కువగా తింటే మాత్రం బరువు బాగా పెరిగిపోతారు. మీకు తెలుసా? థైరాయిడ్ పేషెంట్లు అన్నం తినడం నిషిద్ధం. అన్నం తింటే థైరాయిడ్ సమస్య మరింత పెరుగుతుందని నమ్ముతారు. మరి ఇది నిజమా? కాదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


అన్నం మానేయాలి?

బరువు తగ్గాలనుకునేవారే అన్నాన్ని తక్కువగా తింటుంటారు. అయితే థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా అన్నాన్ని ఎక్కువగా తినకూడదు. ముఖ్యంగా వీళ్లు అన్నాన్ని తిన్నా.. వైట్ రైస్ ను తినకూడదు. బదులుగా బ్రౌన్ రైస్ ను తినొచ్చు. 

బియ్యంలో గ్లూటెన్ 

బియ్యంలో గ్లూటెన్ ప్రోటీన్ ఉంటుంది. ఇది సమస్య మరింత పెంచుతుంది. అందుకే థైరాయిడ్ పేషెంట్లు అన్నం తినకూడదని చెప్తుంటారు. గ్లూటెన్ మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. 
 


సమస్య కావొచ్చు

గ్లూటెన్ అనేది ఒకరకమైన ప్రోటీన్. ఇది శరీరంలో ప్రతిరోధకాలను తగ్గిస్తుంది. ఇది థైరాక్సిన్ హార్మోన్ సమస్యలను కూడా  కలిగిస్తుంది. అందుకే అన్నాన్ని అతిగా తినకూడదని చెప్తుంటారు. 

బరువు పెరగొచ్చు

అన్నంలో ఉండే పిండి పదార్థం వల్ల ఇది చాలా త్వరగా జీర్ణమవుతుంది. దీంతో మనకు చాలా త్వరగా ఆకలిగా అనిపిస్తుంది. ఇంకేముంది కడుపు నిండిందాకా తింటుంటాం.కానీ ఇది మీ బరువును అమాంతం పెంచుతుంది. ఈ కారణంగానే థైరాయిడ్ రోగులు అన్నం తినకుండా ఉండాలని చెప్తుంటారు.
 

థైరాయిడ్ పెరుగుతుంది.

అన్నం తినడం వల్ల థైరాయిడ్ లో మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అన్నాన్ని మరీ ఎక్కువగా తినడం వల్ల మీకు థైరాయిడ్ తో పాటుగా టైప్ -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. 
 

rice

రొట్టె 

బియ్యంలో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం మొదలైన వాటి పరిమాణం రొట్టెలో కంటే తక్కువగా ఉంటుంది. అందుకే థైరాయిడ్ పేషెంట్లు అన్నం తినకూడదని చెప్తుంటారు. 

అన్నాన్ని ఎలా వండి తినాలి? 

మీకు అన్నం తినడం ఇష్టమైతే దీన్ని రకరకాల కూరగాయలతో మిక్స్ చేసి మీ డైట్ లో చేర్చుకోవచ్చు. కానీ అన్నాన్ని చాలా తక్కువగా తినాలి. అన్నం తక్కువగా, కూరగాయలు ఎక్కువగా ఉండేట్టు చూసుకుంటే ఏ సమస్యా ఉండదు. అయితే మీ ఆహారంలో మార్పులు చేయడానికి ముందు ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించండి. 

Latest Videos

click me!