సోంపు ఒక్క జీర్ణ సమస్యలనే కాదు.. ఈ రోగాలను కూడా తగ్గిస్తుంది తెలుసా?

First Published | Oct 28, 2023, 2:03 PM IST

చాలా మంది భోజనం చేసిన వెంటనే సోంపును తింటుంటారు. సోంపు ఆహారం సులభంగా జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు రాకుండా చేస్తుంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ సోంపు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది తెలుసా? 
 

సోంపును చాలా రకాల వంట్లో ఉపయోగిస్తుంటారు. ఇది ఫుడ్ రుచిని పెంచుతుంది. అలాగే మంచి సువాసన వచ్చేలా చేస్తుంది. నిజానికి సోంపు గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. సోంపులో విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, జింక్, మాంగనీస్, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. సోంపును తింటే మలబద్దకం, కడుపునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. 

సోంపులో ఫెంకోన్, ఈస్ట్రోజెన్, అనెథాల్ ఉంటాయి. ఇవి ఆడవారిలో పీరియడ్స్ నొప్పిని తగ్గిస్తాయి. అలాగే పొత్తికడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది. అలాగే పీరియడ్స్ సమయంలో వచ్చే వికారం, వాంతులు, మైకం వంటి లక్షణాలను కూడా సోంపు తగ్గిస్తుంది. 


సోంపులో ఫైటోఈస్ట్రోజెన్లు మన కణాలలో వచ్చే అసాధారణ మార్పులను నివారిస్తాయి. అంటే ఇది రొమ్ము క్యాన్సర్ ను నివారించడానికి కూడా సహాయపడుతుంది. సోంపు గింజలు తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్లు ఇందుకు సహాయపడతాయి.

సోంపు గింజలు దగ్గు, కఫం, ఆస్తమాతో బాధపడేవారికి కూడా సహాయపడుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. సోంపు గింజలను తినడం వల్ల సైనస్, కఫం, ఆస్తమాను నియంత్రించొచ్చు. బ్రోన్కైటిస్ లేదా సైనస్ సమస్యలతో బాధపడేవారు సోంపు గింజలను తమ రోజువారి ఆహారంలో చేర్చుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. 
 

సోంపు గిజంలను తినడం వల్ల జీర్ణక్రియ, జీవక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు ఈ గింజలు మన చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలోని మూత్రవిసర్జన లక్షణాలు శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి సహాయపడతాయి. సోంపు గింజలు ఊబకాయాన్ని కూడా తగ్గిస్తుంది. సోంపులో ఎక్కువ మొత్తంలో నైట్రేట్లు ఉంటాయి.ఇదే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. 

Latest Videos

click me!