ఆకలి తగ్గాలంటే వీటిని తినండి చాలు..

Published : May 25, 2023, 04:33 PM IST

బరువు తగ్గాలంటే ఆకలిని అదుపులో ఉంచుకోవాలి. మోతాదుకు మించి తిన్నారంటే విపరీతంగా బరువు పెరిగేస్తారు. అయితే కొన్ని ఆహారాలను తింటే మీ ఆకలి అదుపులో ఉంటుంది.   

PREV
16
ఆకలి తగ్గాలంటే వీటిని తినండి చాలు..

ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఫైబర్ పిండి పదార్ధం అయినప్పటికీ ఇది ఇతర పిండి పదార్ధాల మాదిరిగా గ్లూకోజ్ గా మార్చబడదు. అందుకే  ఇవి రక్తంలో చక్కెరను ఎక్కువగా పెంచవు. కాబట్టి వీటిని డయాబెటీస్ పేషెంట్లు తింటే మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడానికి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని మీ ఆహారంలో చేర్చడం మంచిదని నిపుణులు చెబుతుంటారు. ఫైబర్ మన గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి మేలు చేస్తుంది. ఫైబర్ కడుపు త్వరగా నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అలాగే ఆకలిని తగ్గిస్తాయి. దీంతో మీరు అతిగా తినలేరు. ఇవి మీరు ఊబకాయాన్ని నియంత్రించడానికి సహాయపడతాయి. ఆకలిని తగ్గించుకోవడానికి ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26
Image: Getty Images

చిలగడదుంపలు

చిలగడదుంపలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందుకే చిలగడదుంపలను తింటే మీ ఆకలి తగ్గుతుంది. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 

36
Image: Getty Images

క్యారెట్లు

క్యారెట్లు విటమిన్ ఎ కు మంచి వనరు. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం తాజాగా కనిపించడానికి సహాయపడుతుంది. అయితే క్యారెట్లలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని తింటే ఆకలి తగ్గిపోతుంది. బరువు కూడా తగ్గుతారు. 

46

స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీలను తింటే ఇమ్యూనిటీ పవర్ పెరగడం నుంచి గుండె ఆరోగ్యంగా ఉండటం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండ్లు పోషకాల బాంఢాగారం. ఫైబర్ పుష్కలంగా ఉండే స్ట్రాబెర్రీలు ఆకలిని తగ్గించడానికి కూడా సహాయపడతాయి.

56

ఓట్స్

బరువు తగ్గడానికి ఓట్స్ ఎంతో సహాయపడుతుంది. ఓట్స్ ఫైబర్ కుఅద్భుతమైన మూలం. ఒక కప్పు ఓట్ మీల్ లో 7.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి డయాబెటిస్, కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి సహాయపడతాయి. అవి ఆకలిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

66
Image: Getty Images

అవొకాడో

అవొకాడోలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గించడానికి సహాయపడతాయి. ఫైబర్ పుష్కలంగా ఉండే అవొకాడో ఆకలి తగ్గడానికి, ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Read more Photos on
click me!