గుమ్మడి గింజలు మన ఆరోగ్యానికి ఇంత మంచివా..!

First Published | May 23, 2023, 2:39 PM IST

గుమ్మడి గింజల్లో ఎక్కువ మొత్తంలో ఫినోలిక్ యాంటీ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. గుమ్మడి గింజలను రోజూ తింటే శరీరంలో ఇనుము  పెరగడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. 
 

pumpkin seeds

గుమ్మడి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మీ రోజువారి ఆహారంలో గుమ్మడికాయ విత్తనాలను చేర్చడం వల్ల  కలిగి ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. పోషకాలు ఎక్కువగా ఉండే గుమ్మడికాయ విత్తనాలను రోజూ తక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల మీ మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

Image: Getty Images

గుమ్మడికాయ విత్తనాలు ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లంతో సహా అసంతృప్త కొవ్వులకు మంచి వనరు. గుమ్మడికాయ విత్తనాలను సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల వాటిలోని ఎఎల్ఎ కంటెంట్ కారణంగా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుమ్మడి విత్తనాలు గుండె సంబంధ వ్యాధులను నివారిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
 


pumpkin seeds

రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడానికి గుమ్మడి గింజలు సహాయపడ్డాయని 2011 అధ్యయనం కనుగొంది. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. గుమ్మడికాయ విత్తనాలు రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి.

Pumpkin seeds

గుమ్మడికాయలో ఉండే ఒక ముఖ్యమైన అమైనో ఆమ్లం ట్రిప్టోఫాన్. గుమ్మడి గింజలు డిప్రెషన్ ను కూడా తగ్గించగలవని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి గింజల్లో ఉండే ఎల్-ట్రిప్టోఫాన్ డిప్రెషన్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.

గుమ్మడికాయ విత్తనాలలో ఫినోలిక్ యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. గుమ్మడి గింజలను తింటే రక్తంలో ఇనుము పరిమాణం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

గుమ్మడికాయ గింజలు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరు. ఒక అధ్యయనంలో.. గుమ్మడికాయ గింజలు రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయని కనుగొనబడింది. ఆరోగ్యకరమైన ఆహారం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆధారాలు కూడా ఉన్నాయి. గుమ్మడికాయ విత్తనాలు ఎక్కువగా ఉన్న ఆహారం రొమ్ము, ప్రోస్టేట్, పెద్దప్రేగుతో సహా కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


గుమ్మడి గింజలు జుట్టు బాగా పెరిగేందుకు కూడా సహాయపడతాయి. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, జుట్టు రాలడాన్ని నివారించడానికి గుమ్మడికాయ విత్తనాలను మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. గుమ్మడికాయ గింజల నుంచి వచ్చే నూనె మూత్ర మార్గ రుగ్మతలను నివారిస్తుంది. లేదా అవి తొందరగా నయమయ్యేందుకు సహాయపడుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి.

గుమ్మడికాయ విత్తనాలు ఆరోగ్యకరమైన, పోషకాహారం. అయినప్పటికీ అలెర్జీ ఉన్నవారు డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

Latest Videos

click me!