జీవితాంతం ఫిట్ గా ఉండాలంటే మనం కసరత్తులు చేయాలి. మంచి వర్కవుట్లు చేయాలంటే మాత్రం మనకు ఎనర్జీ కావాలి. అయితే వ్యాయామం చేసేముందు అన్నీ తింటామంటే కుదరదు. అవి పరిమితంగా, కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. అవి తీసుకుంటేనే మీ పర్ఫామెన్స్ అదిరిపోతుంది. సరైన ప్రీ-వర్కౌట్ ఫుడ్ మీ బాడీకి కావాల్సిన శక్తిని ఇస్తుంది, ఓపికను పెంచుతుంది, కండరాల అలసటను తగ్గిస్తుంది. జిమ్‌కి వెళ్లే ముందు, రన్నింగ్ ట్రాక్‌పై పరిగెత్తే ముందు లేదా యోగా చేసే ముందు మీరు తినాల్సిన టాప్ 10 సూపర్ ఫుడ్స్ ఇక్కడ ఉన్నాయి.