Kitchen tips: చపాతీ ఎక్కువసేపు మెత్తగా ఉండాలంటే ఇలా చేయండి!

Published : Apr 28, 2025, 06:11 PM IST

చపాతీలను చాలామంది ఇష్టంగా తింటారు. కొందరు అన్నంకి బదులు.. మరికొందరు బరువు తగ్గడం కోసం. చపాతీలో కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, ఐరన్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే చపాతీలు చేసిన కాసేపటికే.. గట్టిగా అవుతుంటాయి. దీంతో తినడానికి కష్టంగా ఉంటుంది. మరి ఎక్కువసేపు చపాతీలు మెత్తగా ఉంచడానికి ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.

PREV
14
Kitchen tips: చపాతీ ఎక్కువసేపు మెత్తగా ఉండాలంటే ఇలా చేయండి!

నూనెకు బదులు నెయ్యి

కొంతమంది చపాతీ మెత్తగా ఉండటానికి పిండి కలిపేటప్పుడు నూనె, ఉప్పు కలుపుతారు. దీంతో చపాతీ రుచి కాస్త వేరుగా ఉండటమే కాకుండా, కొంతసేపటి తర్వాత గట్టిపడుతుంది. కాబట్టి, ఎక్కువసేపు అయినా చపాతీ రుచిగా, మెత్తగా ఉండాలంటే నూనెకు బదులు నెయ్యి వాడండి. ఆరోగ్యానికి కూడా మంచిది.

24
సరిపడినంత నీరు

పిండి కలిపేటప్పుడు చాలామంది ఎక్కువ నీళ్లు పోసి కలుపుతుంటారు. దీంతో చపాతీ త్వరగా గట్టిపడుతుంది. కాబట్టి పిండి కలిపేటప్పుడు సరిపడినంత నీరు పోసి కలిపితే ఎక్కువసేపు మెత్తగా ఉంటుంది.

 

34
పాలు లేదా వేడి నీరు

పిండి కలిపేటప్పుడు అందులో నీటికి బదులు పాలు లేదా వేడి నీరు కలపవచ్చు. కనీసం 15 నిమిషాలైనా పిండిని కలపాలి. తర్వాత కొంతసేపు అలాగే ఉంచి.. ఉండలుగా చేసి రొట్టెలు చేసుకుంటే మెత్తగా వస్తుంది. ఎక్కువసేపు మెత్తగా ఉంటుంది.

పగుళ్లు ఉండకూడదు :

చపాతీ కోసం ఉండలు చేసేటప్పుడు లేదా చపాతీ తాల్చేటప్పుడు అందులో పగుళ్లు లేకుండా చూసుకోవాలి. పగుళ్లు ఉంటే చపాతీ త్వరగా గట్టిపడుతుంది.

44
చపాతీ కాల్చే విధానం..

చపాతీ కాల్చేటప్పుడు వాటి పైభాగంలో బుడగలు వచ్చిన వెంటనే మరోవైపు తిప్పి వేయండి. తర్వాత దానిపై నూనె రాయండి. ఈ విధంగా చపాతీ కాల్చినట్లయితే ఎక్కువసేపు మెత్తగా ఉంటుంది.

ఇవి గుర్తుంచుకోండి : 

- చపాతీలను ఒక్కొక్కటిగా కాల్చి పేర్చేటప్పుడు వాటిపై నెయ్యి రాసి ఉంచండి. దీంతో రొట్టె తేమను కోల్పోదు. 

- అలాగే చపాతీలను అల్యూమినియం ఫాయిల్, జిప్ లాక్ బ్యాగ్ వంటి వాటిలో ఉంచండి. దానివల్ల చపాతీ ఎక్కువసేపు మెత్తగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories