ఈ రోజుల్లో జొన్న రొట్టె కంటే గోధుమ చపాతీలనే ఎక్కువగా తింటున్నారు. నిజానికి గోధుమ చపాతీలు కూడా ఆరోగ్యానికి మంచివే. గోధుమ పిండిలో విటమిన్ బి, ఐరన్, మెగ్నీషియంతో పాటుగా ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. రోజూ గోధుమ చపాతీని తినడం వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే బరువు కూడా తగ్గుతారు.
అయితే గోధుమ పిండి కూడా కల్తీ అవుతుందన్న ముచ్చట మీకు తెలుసా? అవును చాలా మంది గోధుమ పిండిలో పొట్టును కలుపుతారు. దీనివల్ల పిండి నాణ్యత తగ్గుతుంది. అలాగే ఈ పిండిలో పోషకాలు కూడా తక్కువగా ఉంటాయి.
నిజానికి ఈ గోధుమ పొట్టులో ఫైబర్ కంటెంట్ ఉంటుది. కానీ దీనిలో నాణ్యత లేని పొట్టునే కలుపుతారు. దీనివల్ల చపాతీల రుచి తగ్గుతుంది. అలాగే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. అందుకే గోధుమ పిండి కల్తీ జరిగిందా? లేదా?అనేది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం పదండి.