పిల్లలకు రోజూ ఒక్క గుడ్డు పెడితే ఏమౌతుంది?

First Published | Nov 7, 2024, 3:33 PM IST

కోడిగుడ్డులో చాలా పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా కోడిగుడ్డులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. మరి, అలాంటి కోడిగుడ్డును రోజూ పిల్లలకు పెడితే ఏమౌతుందో తెలుసా?

కోడిగుడ్డు ఆరోగ్యానికి మంచిది అనే విషయం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అని మన అందరికీ తెలుసు. ఎందుకంటే కోడి గుడ్డులో చాలా పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్ కి బెస్ట్ సోర్స్. మరి అలాంటి కోడిగుడ్డును పిల్లలకు రోజూ ఇవ్వొచ్చా..? ఇలాంటి సందేహం చాలా మంది తల్లులకు ఉంటుంది. మరి,  దీనికి నిపుణుల సమాధానం ఏంటో మనం ఓసారి చూద్దాం..

పిల్లలకు గుడ్ల వల్ల కలిగే ప్రయోజనాలు

నిపుణుల ప్రకారం మనం సంవత్సరం వయసు దాటిన పిల్లలు అందరికీ రోజూ కోడిగుడ్డును ఇవ్వచ్చట. గుడ్డులోని పోషకాలు పిల్లల ఎదుగుదలకు సహాయపడుతాయి. అందుకే ఎలాంటి సందేహం లేకుండా పిల్లలకు గుడ్డు పెట్టొచ్చు.

గుడ్డులో ఉండే పోషకాలు:

గుడ్డులో ప్రోటీన్, ఐరన్, ఒమేగా 3 కొవ్వు, విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ బి12, విటమిన్ బి6 వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యానికి చాలా మంచివి. పిల్లల మెదడు చురుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి.

Latest Videos


పిల్లలకు రోజూ గుడ్డు ఇస్తే కలిగే లాభాలు:

కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది

గుడ్డులో ఉండే ప్రోటీన్ పిల్లల కండరాల పెరుగుదలకు చాలా ముఖ్యం. ఇందులోని పోషకాలు శరీరంలోని ఇతర కణాలను బాగుచేయడానికి కూడా సహాయపడతాయి. ఒక గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది పిల్లల శారీరక పెరుగుదలకు, బరువును నియంత్రించడానికి సహాయపడుతుంది. పిల్లలకు ఉదయం టిఫిన్ లో గుడ్డు ఇవ్వండి. ఆకలిని అదుపులో ఉంచుతుంది.

మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది

గుడ్డులో ఉండే కోలిన్ పిల్లల మెదడు అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. పిల్లల జ్ఞాపకశక్తి, అభ్యాస నైపుణ్యాలను పెంచుతుంది. పిల్లల ఆహారంలో రోజూ గుడ్డు చేర్చితే వారి నేర్చుకునే, అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది.

ఎముకలను దృఢంగా ఉంచుతుంది

గుడ్డులో ఉండే విటమిన్లు పిల్లల ఎముకలను దృఢంగా ఉంచడానికి సహాయపడతాయి. రోజూ ఉదయం పిల్లలకు గుడ్డు ఇస్తే వారి దంత ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు బలంగా తయారవుతాయి.

కంటి ఆరోగ్యానికి మంచిది

పిల్లలు ఎక్కువ సేపు స్క్రీన్ ముందు కూర్చుంటే వారి కళ్ళు బలహీనపడతాయి. అలాంటప్పుడు పిల్లలకు గుడ్డు ఇవ్వడం చాలా మంచిది. గుడ్డులో ఉండే యాంటీఆక్సిడెంట్లు పిల్లల కళ్ళను హానికర కిరణాల నుంచి కాపాడుతాయి. వారి కంటి చూపును మెరుగుపరుస్తాయి.

జీర్ణక్రియకు సహాయపడుతుంది

గుడ్డులో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.

పిల్లలకు గుడ్డు ఎలా ఇవ్వాలి?

పిల్లలకు ఉడికించిన గుడ్డు ఇవ్వడం మంచిది. ఆమ్లెట్, శాండ్విచ్, గుడ్డు కూర వంటివి కూడా చేసి పెట్టొచ్చు.

click me!