2.అలసట తగ్గించే సీతాఫలం..
ఏదైనా పని చేస్తున్నప్పుడు మీకు బలహీనంగా, అలసిపోయినట్లుగా అనిపిస్తే కచ్చితంగా సీతాఫలం తినాల్సిందే. రోజూ ఒక్క పండు తిన్నా.. మీ నోట ఇక నీరసం అనే మాట రాదు. ఎందుకంటే ఈ పండు మీకు తక్షణ శక్తిని అందిస్తుంది. దీనిని తినడం వల్ల కండరాల బలహీనత కూడా ఉండదు.
బరువు పెరగడంలో మేలు చేస్తుంది
సీతాఫలంలో మంచి మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. మీరు చాలా సన్నగా ఉన్నట్లయితే, బరువు పెరగడానికి సీతాఫలాన్ని క్రమం తప్పకుండా తినండి. దీన్ని నిరంతరం తినడం వల్ల సులభంగా బరువు పెరగవచ్చు.