Ice Cream: ఈ ఐస్ క్రీమ్ తాగిన మత్తు వదిలిస్తుంది.. పిల్లలకు కాదు, పెద్దలకు మాత్రమే

Published : Mar 21, 2026, 05:39 PM IST

Ice Cream: ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుందని ప్రతి పేరెంట్స్ తమ పిల్లలకు చెబుతూ ఉంటారు. వాళ్లు అడిగి ఎంత మారాం చేసినా కూడా ఐస్ క్రీమ్ కొనివ్వరు. అయితే..ఈ ఐస్ క్రీమ్ తింటే జలుబు చేయదు, తలనొప్పి తగ్గిస్తుంది.. 

PREV
13
Hangover Ice Cream

ఎండాకాలంలో వేడికి చల్లని ఐస్ క్రీమ్ తింటే ఎంతో హాయిగా ఉంటుంది. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా ఐస్ క్రీమ్ తినడానికి అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటి వరకు మీరు పాలతో, పండ్లతో తయారు చేసిన ఐస్ క్రీమ్స్ చూసి ఉంటారు.. టేస్ట్ కూడా చేసి ఉంటారు. కానీ...మెడిసిన్ తో తయారు చేసిన ఐస్ క్రీమ్ గురించి ఎప్పుడైనా విన్నారా? అలాంటి ఐస్ క్రీమ్ మన దేశంలో కాదు.. నెదర్లాండ్స్ లో తయారు చేశారు. దాని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

మనలో చాలా మంది జ్వరం, తలనొప్పి రాగానే వెంటనే పారాసెటమాల్ మెడిసిన్ తీసుకుంటారు. ఈ మెడిసిన్ ని ఐస్ క్రీమ్ లో కలిపి హ్యాంగోవర్ ఐస్ క్రీమ్ తయారు చేశారు. దీనిని నెదర్లాండ్ లో కనిపెట్టడం విశేషం..

23
ఈ ఐస్ క్రీమ్ తయారీ వెనక కథేంటి..?

నెదర్లాండ్స్‌లోని హెలెండోర్న్ (Hellendoorn) అనే గ్రామంలోని ఒక బేకరీ యజమానికి ఈ ఐస్ క్రీమ్ ఐడియా వచ్చింది. రాత్రంతా పార్టీలు చేసుకుని, మరుసటి రోజు ఉదయం హ్యాంగోవర్‌తో (తలనొప్పి, నీరసం) బాధపడేవారికి ఈ ఐస్‌క్రీమ్ ఒక విరుగుడుగా పని చేస్తుందని ప్రచారం చేశారు.

2. ఐస్‌క్రీమ్‌లో ఏముంటుంది?

ఒక స్కూప్ ఐస్‌క్రీమ్‌లో దాదాపు 500mg పారాసెటమాల్‌ను కలిపారు. అంటే ఒక ఐస్‌క్రీమ్ తింటే ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకున్నంత ప్రభావం ఉంటుందన్నమాట.

33
డచ్ అధికారులు ఎందుకు అభ్యంతరం చెప్పారు?

ఈ ఐస్‌క్రీమ్ వార్తల్లోకి రాగానే డచ్ ఫుడ్ అండ్ సేఫ్టీ అథారిటీ (NVWA) రంగంలోకి దిగింది. దీనిని అమ్మడం చట్టవిరుద్ధమని హెచ్చరించింది. దానికి ప్రధాన కారణాలు:

లైసెన్స్ సమస్య: ఔషధాలను ఆహార పదార్థాల్లో కలిపి అమ్మకూడదు. పారాసెటమాల్ కలిపిన తర్వాత అది 'ఆహారం' కాదు, 'మందు' (Medicine) అవుతుంది. మందులను అమ్మాలంటే ఫార్మసీ లైసెన్స్ తప్పనిసరి.

ఓవర్ డోస్ ప్రమాదం: ఒక వ్యక్తి ఐస్‌క్రీమ్ తిని, అది మందు అని మర్చిపోయి మళ్ళీ విడిగా టాబ్లెట్స్ వేసుకుంటే.. శరీరంలో పారాసెటమాల్ మోతాదు పెరిగి లివర్ (కాలేయం) దెబ్బతినే ప్రమాదం ఉంది.

పిల్లలకు ముప్పు: ఐస్‌క్రీమ్ అంటే పిల్లలు ఇష్టంగా తింటారు. పొరపాటున పిల్లలు ఈ 'మెడికేటెడ్ ఐస్‌క్రీమ్' తింటే వారి ఆరోగ్యం విషమించవచ్చు.

వైద్యుల హెచ్చరిక (Medical Fact)

నిజానికి హ్యాంగోవర్ ఉన్నప్పుడు పారాసెటమాల్ తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే మద్యం, పారాసెటమాల్ రెండూ లివర్ మీద ప్రభావం చూపుతాయి. ఈ రెండింటి కలయిక కాలేయానికి మరింత హాని చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories