Telugu

Dry Fish: ఇలా చేస్తే ఎండు చేపలు వాసన రావు, టేస్ట్ అదిరిపోతుంది

Telugu

ఎండు చేపల వాసన..

ఎండు చేపలు వండుతుంటే విపరీతమైన వాసన వచ్చేస్తుంది. అలా వాసన రాకుండా, కూర రుచి అద్భుతంగా ఉండాలంటే సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే. 

Image credits: Instagram
Telugu

వేడినీళ్లు, నిమ్మరసం

వండటానికి 20 నిమిషాల ముందు ఎండు చేపలను వేడి నీటిలో నానబెట్టండి. ఆ నీటిలో 5 చెంచాల నిమ్మరసం, కొద్దిగా ఉప్పు కలపాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగితే వాసన మాయమవుతుంది.

Image credits: Getty
Telugu

బియ్యం కడిగిన నీళ్లు

ఎండు చేపలను బియ్యం కడిగిన నీటితో శుభ్రం చేస్తే నీచు వాసన పోవడమే కాదు, వాటికి అంటుకున్న ఇసుక, ఇతర మురికి కూడా సులభంగా పోతుంది.

Image credits: stockPhoto
Telugu

వంట చేసేటప్పుడు ఇలా చేయండి

ఎండు చేపల కూర వండేటప్పుడు లేదా వేయించేటప్పుడు, ఒక చెంచా అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించండి.

Image credits: stockPhoto
Telugu

వాసన పూర్తిగా పోతుంది

వంట చేసేటప్పుడు కొద్దిగా చింతపండు రసం (పులుసు) లేదా ఒక కప్పు పాలు కలిపినా కూడా వాసన పూర్తిగా పోతుంది.

Image credits: Getty
Telugu

కిచెన్‌లోని వాసన పోవాలంటే?

ఎండు చేపలు వండుతున్నప్పుడు కిచెన్‌లో వచ్చే వాసన పోవాలంటే, ఒక గ్లాసు నీటిలో కొద్దిగా వెనిగర్ వేసి బాగా మరిగించండి. ఇలా చేస్తే కిచెన్‌లోని వాసన తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

పాలతో మరో చిట్కా

ఎండు చేపలను చిక్కటి గేదె పాలలో కాసేపు నానబెడితే వాసన పూర్తిగా పోతుంది. ఆ తర్వాత 2-3 సార్లు మంచి నీటితో కడిగి వంటకు వాడుకోవాలి.

Image credits: Getty
Telugu

గాలి చొరబడని డబ్బాలో...

ఎండు చేపలను ఇంటికి తీసుకురాగానే గాలి చొరబడని డబ్బాలో (Air-tight container) పెడితే, ఇంట్లో వాసన రాకుండా ఉంటుంది.

Image credits: AI

Blouse Designs: బ్లౌజ్ లుక్ అదిరిపోవాలంటే ఇలాంటి స్లీవ్స్‌ ట్రై చేయండి

Protein Foods: గుడ్డును మించి ప్రోటీన్ ఇచ్చే 7 వెజ్ వెరైటీస్ ఇవే!

Money Plant:మనీ ప్లాంట్ బాగా పెరగాలా? ఈ నీళ్లు పోసినా చాలు

Silver Bracelet: ట్రెండీ డిజైన్ లో సిల్వర్ బ్రేస్‌లెట్స్.. ఇవిగో