eye health
పంచేంద్రియాల్లో అత్యంత సున్నితమైన, అందమైన అవయవాల్లో కళ్లు ఒకటి. కళ్లను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే కంటి చూపు పోయే అవకాశం ఉంది. చీకట్లో కాసేపు బతకడమే భయంగా ఉంటుంది. అలాంటిది జీవితాంతం కంటిచూపు లేకుండా ఉండటమంత నరకం మరేదీ ఉండదు. అయితే కొన్ని అలవాట్ల వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. కొన్ని కారణాల వల్ల కంటిచూపు తగ్గుతోంది. స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం, టీవీలను ఎక్కువ సేపు చూడటం, స్మోకింగ్ వంటి ఎన్నో కారణాల వల్ల కళ్ల ఆరోగ్యం దెబ్బతింటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
eye health
శరీరంలో పోషకాలు లోపించడం వల్ల కూడా కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే కంటిచూపు తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే మనం తినే ఆహారం మన కంటి ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
క్యారెట్
కంటి ఆరోగ్యానికి క్యారెట్ చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యారెట్ ను క్రమం తప్పకుండా తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. క్యారెట్లలో పుష్కలంగా ఉండే విటమిన్ ఎ కూడా కంటిచూపును మెరుగ్గా ఉంచుతుంది.
Image: Pexels
బచ్చలికూర
బచ్చలికూరలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ కూరను క్రమం తప్పకుండా తిన్నా కంటి చూపు బాగుంటుంది. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
tomatoes
టమాటాలు
టమాటాలే కదా అని తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే టమాటాలు మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. టమాటాల్లో ఉండే లైకోపీన్ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.
beet root
బీట్ రూట్
బీట్ రూట్ లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ బి, విటమిన్ సి కళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
క్యాప్సికమ్
బెల్ పెప్పర్ అని కూడా పిలువబడే క్యాప్సికమ్ మన కళ్లను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ కూరగాయలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రెడ్ బెల్ పెప్పర్ ను తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటిచూపు మెరుగుపడుతుంది.
sweet potato
చిలగడదుంప
చిలగడదుంపలు కూడా మన ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి. చిలగడదుంపలో పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే చిలగడదుంపలు పేరుకు తగ్గట్టుగానే తీయగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.